ఎన్నో రోజుల నుంచి వ్రాసే అంత మంచి శీర్షిక దొరకలేదు. ఈ రోజు "ఝుమ్మంది నాదం" చిత్రంలో చివరగా వచ్చే పాటలోని సాహిత్యం విని ఆశ్చర్యపోయాను. దేశం గురించి ఇంత మంచి సందేశం వున్న పాట ఈ రోజుల్లోని చిత్రాల్లో చూడలేదు! ఈ చిత్రం ఇంతకు ముందు చూసాను కానీ ఈ చివరి పాట సరిగ్గా చూడలేదు.
మహా కవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు వ్రాసిన "దేశమంటే మట్టికాదోయి" పాటను స్పూర్తిగా తీసుకుని వ్రాసిన ఈ పాటలోని కొన్ని మాటలు నాకు బాగా నచ్చాయి! "తీవ్రవ్యాదిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్", "గడ్డినుంచి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్", "అబలపై ఆమ్లాన్ని చాల్లే అరాచకమే కాదు కాదోయ్", "చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్", "సంది దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్","ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్" లాంటి ఎన్నో అంశాలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
ఇంత మంచి అర్థం, సందేశం వున్న పాట వ్రాసిన చంద్రబోస్ గారికి, ఆ పాటని బాలు గారితో అంత గొప్పగా పాడించిన కీరవాణి గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
..మీ అనిల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!