విశ్వనాధ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విశ్వనాధ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జులై 2025, శుక్రవారం

మరువలేని పాట .. అలనాటి పాట ..

కొన్ని పాటలు ఒక వారం వినగానే ఆసక్తి పోతుంది. కొన్నింటిని వింటే నెలకు మర్చిపోతాము . మరికొన్ని వాటిని ఒక సంవత్సరం తర్వాత మర్చిపోతాము, మిగతావి పది సంవత్సరాలకి మర్చిపోతాము. కానీ ఈ పాట ఎన్నాళ్ళు గడిచినా, ఎన్నేళ్లు మారినా , అందులోని అందం అలానే ఉంటుంది. అంతటి గొప్ప పాత వ్రాసారు సిరి వెన్నెల సీతారామ శాస్త్రి  గారు. అంట గొప్పగా స్వరాలనందించారు మహదేవన్ గారు. ఎప్పుడు మనసు అదోలా వున్నా, ఎప్పుడు సమయం ఆగి పోయినట్టు ,  ఒంటరిగా ఉంటుందో,  ఈ పాట  నా మనసులో మోగుతుంది : 

ఆది భిక్షువు వాడినేది కోరేది 

బూడిదిచ్చే వాడినేది అడిగేది !

ఆది భిక్షువు వాడినేది కోరేది...

బూడిదిచ్చేవాడినేది అడిగేది...

ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది

తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది

తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది

గిరి బాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు
వాడినేది కోరేది...
వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది...
ముఖ ప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేది...
ముక్కంటి | ముక్కోపి | ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది

...............

ఈ పాట అంత ఎందుకు నచ్చిందో నాకు తెలియదు. కానీ అంత బాగా నచ్చటానికి ఒక కారణం ఉండవలసిన అవసరం లేదు. నాకు దైవ భక్తి అంత గా లేదు. ఎదో శక్తి ఉందని తెలుసు కానీ దానికి "దేవుడు" అనే పేరు పెట్టి ఆ శక్తి ని చిన్నది చేయటం ఇష్టం లేదు.
నాకు ఈ పాట నచ్చటానికి ఒక కారణం ఉండవచ్చు: మన అహాన్ని పక్కన పెట్టి, కేవలం ఎదో ఆశించి పూజలు చేయటం మాని, అసలైన మానవ సేవ చేయటం కన్నా గొప్ప మార్గం ఏదైనా ఉందా? ఎవరు దేవుడిని నమ్మినా, నమ్మకపోయినా సాహిత్యాన్ని నమ్మి ఈ పాటని వ్రాసినందుకు చెప్పుకోవాలి.

..మీ అనిల్