6, ఏప్రిల్ 2012, శుక్రవారం

౬ఏప్రిల్౨౦౧౨, శుక్రవారం: బుల్లి పిడుగులు!

ఇదే చిన్నప్పుడు మా పల్లెటూరు(కొత్తపాలెం) లో బంధువులైన(తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరదళ్ళు, బావమర్దిలు!) చిన్న పిల్లల గురించి నేను వ్రాసిన కవిత(౨౦జూన్౨౦౦౦ న వ్రాసిన కవిత). ఇప్పుడు చదువుతుంటే నాకే నవ్వొస్తుంది! హహహ :-):

బుల్లి పిడుగులు!

అల్లరి చేస్తూ వేస్తారు అడుగులు
ముద్దొచ్చే ఈ బుల్లి పిడుగులు!
రాజాగా గోపాలుడు పుట్టాడు,
అల్లరి ఉద్యమం చేపట్టాడు
తనకుండదు విద్యార్థి అవ్వాలని,
తన ఉయ్యాల పరులకివ్వాలని!
చూచుటకు అమాయకురాలే కానీ
చేతల్లో తీసిపోదు రాణి
సుమంతుడు చిలిపి చేష్టలు తక్కువ,
అయినా మురిపించే మాటలు ఎక్కువ!
అమృత నోటి నుంచి వచ్చే నవ్వులు
పారిజాతం నుంచి రాలే పువ్వులు
భాగ్యనగరం వెళ్ళుట మౌనిక ఆశ
చివరకు మిగిలింది నిరాశ
క్రికెట్లో బంటి, విక్కిల ప్రతిభ
ఆటల్లో వారి నైపుణ్యానికి ప్రతీక!
ఈ పిడుగుల్లో కావ్య చేరింది
ఎదురులేని ఉత్సాహం చెలరేగింది
మున్ని వేస్తుంది రోజుకో ముగ్గు,
అనుషకి కొత్తపాలెం అంటేనే ముద్దు!
తొండి చేస్తే గీత అనేస్తుంది మాటలు
ఈమె ముందు సాగవు విక్కీ దొంగాటలు!


..మీ అనిల్

1 కామెంట్‌:

ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!