ఈ రోజు మా కార్యాలయం లో మధ్యాహ్న్నం ఒక చిన్న భూకంపం వచ్చింది. పద్ధతి ప్రకారం అందరం కొంచెం సేపు బయట నుంచుని మళ్లీ వచ్చి కూర్చున్నాము. వార్తలు చదువుతుంటే "అస్సలు వాళ్లకు ఇంతేనా తెలుసు?" అనిపిస్తుంది. ప్రతి విషయాన్ని స్పష్టంగా తప్పు లేకుండా ఎలా చెప్పాలో వాళ్లకి తేలీదు. ఒక్కోసారి వార్తల్లో చూపించే తప్పుడు బొమ్మలు ప్రజల్ని మోసం చేయటమే అవుతుంది. ఆంగ్ల చిత్రాలనుంచి తీసిన ఒక మంచి నమ్మసక్యంగా వుండే దృశ్య మాలికను చూపించి ఇదే నిజంగానే జరుగిందేమో అనిపించేలా డబ్బా కొడతారు. దాన్ని చూసిన అమాయక ప్రజలు అనవసరంగా కంగారు, భయపడతారు.
ఎప్పటికైనా ఇలాంటి వార్తలను చూపించే వాళ్ళందరూ మారతారని ఆశిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!