12, ఆగస్టు 2019, సోమవారం

"సమయమా" .. చిత్రం: అంతరిక్షం(౨౦౧౯); గేయం: హరిణి, యజిన్ నిజర్

మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట, సంగీతం!:


సమయమా
అదేమిటంత తోందరేంటి ఆగుమా
సమయమా
మరింత హాయి పోగుజేయనీయుమా
చేతిలోన చేతులేసుకున్న చోటులోన
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన
శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన
ఆనంద వర్ణాల సరిగమ
సమయమా
సమయమా
సమయమా
కదలకే క్షణమా
జతపడే యదలలో మధురిమా
వదులుకోకే వినుమా
ఆ నింగి జాబిల్లిపై
ఏ నీటి జాడున్నదో
నే చూడలేనే అపుడే...
ఈ నేల జాబిల్లి పై
సంతోష భాష్పాలని
చూస్తూ వున్నానే ఇపుడే...
తనేనా సగంగా
తనేనా జగంగా
స్వరాల ఊయలూగుతుండగా
ఏడేడు లోకాలు
ఆరారు కాలాలు
ఆ తార తీరాలు
ఆనంద ధ్వారాలు
విరిసి మురిసే వేళ
తీపి కురిసే వేళ
ఈ స్వప్న సత్యాన్ని
దాటేసి పోనీకు
సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా
జతపడే యెదలలో మధురిమా
వదులుకోకే వినుమా



..మీ అనిల్

3, మే 2017, బుధవారం

సాహోరే బాహుబలి!: సాహిత్యం

బాహుబలి౨ లో వచ్చిన ఈ పాట ఎన్ని సార్లు విన్నా, తనివి తీరనిది: సాహోరే బాహుబలి! ఆ పాట సాహిత్యం ఇదిగో మీ అందరి కోసం:

సాహిత్యం: డా. కే. శివశక్తి దత్త, డా. కే. రామకృష్ణ
భళి భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి
భళి భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలీ… పట్టాలి
భువనాలన్ని జైకొట్టాలి
గగనాలే ఛత్రం పట్టాలీ..
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స
ఆ జననీ దీక్ష అచలం..
ఈ కొడుకే కవచం..
ఇప్పుడా అమ్మకి అమ్మ ఐనందుకా
పులకరించిందిగా ఈ క్షణం…
అడుగులు గుట్టల్ మిట్టల్ గమించు
పిడికిట పిడుగుల్ పట్టి మించు
అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు
అవనికి స్వర్గాలే దించు
అంత మహా బలుడైనా అమ్మ వొడి పసివాడే
శివుడైనా భవుడైనా అమ్మకు సాటి కాదంటాడే
హేయ్‌స రుద్రస్స హేయ్‌సర భద్ర సముద్రస్స
హేయ్‌స రుద్రస్స హేయ్‌సర భద్ర సముద్రస్స
హేయ్‌స రుద్రస్స హేయ్‌సర భద్ర సముద్రస్స
హేయ్‌స రుద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స
హేయ్‌సరభద్ర సముద్రస్స
హేయ్‌స రుద్రస్స హేయ్‌సర భద్ర సముద్రస్స
హేయ్‌స రుద్రస్స హేయ్‌సర భద్ర సముద్రస్స
హేయ్‌స రుద్రస్స హేయ్‌సర భద్ర సముద్రస్స
హేయ్‌స రుద్రస్స హేయ్‌సర భద్ర సముద్రస్స
హేయ్‌స రుద్రస్స హేయ్‌సర భద్ర సముద్రస్స
భళి భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలీ…
భళి భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలీ… పట్టాలి
భువనాలన్ని జైకొట్టాలి
గగనాలే ఛత్రం పట్టాలీ..

..మీ అనిల్

25, ఏప్రిల్ 2017, మంగళవారం

శివగామి: బాహుబలి పుర్వాంకం

ఈ మధ్య అంతర్జాలం లో వచ్చిన "శివగామి" పుస్తకం చదువుతున్నాను. బాహుబలి చలన చిత్రం లో జరిగిన కథ కి ముందు జరిగినట్టుగా వ్రాసిన ఈ నవల నాకు చాలా బాగా నచ్చింది! దాంట్లోని కొంత భాగాన్ని తెలుగు లోకి అనువదించాలనిపించింది, కొన్ని పంక్తులు చేసాను! ఇవిగో, మీకోసం:

"
చీకటి. కటిక చీకటి. ఆ కాళరాత్రిని, మరణాన్ని సైతం భయపెట్టే చీకటి! ఇంతటి చీకటిలో ఆ గుర్రపు బండికి వేలాడి వున్న దీపం వేలాడుతూ ఆ బండితో పాటు వూగుతుంది. ఆమెకి దాన్ని ఆర్పేయాలని వుంది కానీ వాళ్ళు వెళుతున్న మార్గం ఎంత ప్రమాదంతో కూడుకుందో తనకి  తెలియంది కాదు. మార్గానికి రెండు వైపులా వున్న అడవి మార్గం పైకి ముంచుకొస్తున్నట్టు వుంది. వాళ్ళు అలా కొండల్లో వంపులు తిరుగుతున్న మార్గం లో ప్రయాణిస్తుండగా వేలాడుతున్న చెట్ల కొమ్మలు ఆమె ముఖాన్ని తాకుతూ వున్నాయి. ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. మనసు బరువుగా మారింది. ఎన్నో పాత జ్ఞాపకాలు ఆమె మది లో కదులుతున్నాయి. ఆ బాధ భరించలేనిది. చీకటి పొరల్లో నుంచి గత పన్నెండేళ్ళుగా తాను పాతిపెట్టిన ఆ జ్ఞాపకాలు మల్లీ ఇప్పుడు మెల్లగా అరుస్తున్నాయి. పీడకకల లాంటి ఆ ప్రదేశానికి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు, కాని తప్పని పరిస్థితి! ఐదేళ్ళ వయసులోనే తన కుటుంబానికి జరిగిన ఆ ఘోరాన్ని దారిలో వున్న ప్రతి చెట్టు మల్లీ ఆమె ముందుకు తెస్తున్నాయి. ఇలా ఊహల్లో తప్పిపోయిన తను ఒక్కసారిగా బండి ఇచ్చిన ఒక కుదుపుకి సంయమనం కోల్పోయి తన తల బండికి కొట్టుకుంది.

“కుందేలు” బండి నడుపుతున్న రాఘవ అన్నాడు. ఎలాంటి చిన్న ప్రాణికి అయినా హాని చేయకుండా వుండలేనివాడు. గుర్రాల సవ్వడిని విని అడ్డంగా ఒక కుందేలు పరుగు పెట్టింది.
“ఇలాంటి సమయం లో వెళ్ళటం అవసరమా?” అలా ఎన్నో సార్లు అడిగాడు. కాని ఆమె మాట్లాడలేదు. దూరంగా, మలుపులు తిరిగిన మార్గం చివర ఒక కోట కనిపించింది. దాన్ని చూసి మల్లీ అడిగాడు: “వెనక్కి వెళదామా?”
దానికి ఆమె ఇచ్చిన హావ భావాన్ని చూసి రాఘవ గుర్రాల్ని ముందుకు కదిలించాడు.
ఆ దారిలో ఒకప్పుడు పూల తోట వుండటం ఆమెకి గుర్తుకు వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడంతా పిచ్చి చెట్లు మొలిచాయి. మరీ మెరక కావటంతో  ఆ దారిలో ముందుకు వెళ్ళటం చాలా కష్టం అయిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే లోతైన లోయ వుంది. ఇక లాభం లేదని దీపాన్ని పట్టుకుని ఆమెని దింపటానికి రాఘవ దిగి తన చెయ్యి అందించాడు. కాని ఆమె అందుకోకుండా కిందకి దూకి, దారి ముగిసిన చోటు దెగ్గరికి వెళ్లి చూసింది. దేగ్గర్లో భారీ జలపాతం శబ్దం వినిపిస్తుంది. ఇక్కడే ఒక వేలాడే వంతెన ఉండాలే అనుకుంది. పక్కకి చూడగా కనిపించింది. వెంటనే మెట్ల మీదుగా ఆ వంతెన ఎక్కి రెండు వైపులా వున్నా తాళ్ళను పట్టుకుని ముందుకు వెళ్ళసాగింది.
“నువ్వు నిజంగానే ఈ వంతెనని దాటాలనుకుంటున్నావా?” ఎప్పటిలాగే ఆమె మౌనం గా ముందుకు వెళ్ళసాగింది. కొంత దూరం తర్వాత తాళ్ళు లోతైన చీకటిలో మాయమైపోయాయి. తన కాళ్ళ కింద వున్నా ఒక చెక్క విరిగి లోయలోకి పడిపోయింది. రాఘవ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది! చలి లో కూడా ఆమె చేతులు చమటలు పట్టాయి.
ఈ ప్రయాణం చేయటానికి ముఖ్య కారణం పన్నెండేళ్ళ తర్వాత చిన్నప్పటి తన పని మనిషి లచ్మి ని కలవటం. తుది శ్వాసలో లచ్మి తనకి ఒక పుస్తకం ఇచ్చింది. అది ఆమె తండ్రి దేవరాయ ఆయన కూతురికి ఇమ్మని లచ్మి కి ఇచ్చాడట. ఆ పుస్తకం లో వున్నా భాష అర్థం కానిది.
దేవరాయ మాహిష్మతి రాజ్యం లో ప్రజల చేత గౌరవించబడిన , పేరున్న భూస్వామి. అదంతా చిత్రవధ కు ముందు. దాన్ని తలచుకునే సమయం ఇది కాదు. ఇప్పుడు తన దృష్టంతా ఈ వంతెన దాటడం మీదే వుంది.
ముందు ఏడడుగుల వరకు వంతెన మీద చెక్కలు లేవు. “జాగ్రత్త” అరిచాడు రాఘవ.
దీపాన్ని రాఘవ కి ఇచ్చి కొన్ని అడుగులు వెనక్కి వేసింది.
“నీకు పిచ్చా?” అతను అంటూనే వున్నాడు, ఆమె పరుగెడుతూ ఒక్క దూకు తో వంతెన అటువైపుకు క్షేమంగా చేరింది.

“దీపాన్ని నాకు విసిరేసి నువ్వు కూడా రా... పిరికి పంద!” అరిచింది ఆమె.
రాఘవ దీపాన్ని విసిరాడు. ఆ విసురుకి దీపం ఆరిపోయింది. ఇక ఆకాశంలో చుక్కలు తప్ప ఎటువంటి వెలుగు లేదు.

ఎలా రాను?
"

..మీ అనిల్

26, ఏప్రిల్ 2014, శనివారం

౨౬ఏప్రిల్౨౦౧౪, శనివారం: కిన్నెరసాని!

ఇప్పుడే మా మరదలు అంతర్జాలం లో పంపిన ఒక అందమైన, చిన్న పాటని చదివాను! అది ఇదే:

కిన్నెరసానికి వన్నెలు కూర్చిన వయ్యరమే నీవా!
తొలిగా వీచిన సూర్యుని వెచ్చని వేకువ రేఖవా!
బ్రహ్మను మించిన బాపు సృష్టికి రుపానివి నీవా!
వెలిగే తెలుగింటి అమ్మకు నుదుటిన రంగుల ముగ్గువా!
అందరాని ఊహవా? అందమైన తోడువా?

ఇది ఏ చలన చిత్రంలోనిదో తెలీదు కాని, చదవటానికి బాగుంది! ఇందులో "తొలిగా వీచిన సూర్యుని వెచ్చని వేకువ.." నాకు బాగా నచ్చింది! ఉదయాన్నే చూసే మొదటి సూర్య కిరణం ఎప్పటికీ మర్చిపోలేము. ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు మామూలు అనిపించొచ్చు కాని ఉదయిస్తున్న సూర్యుడిని చూసే క్షణాలు అమూల్యమైనవి! ౨౦౦౪ లో కృష్ణ పుష్కరాలు జరిగినప్పుడు కృష్ణమ్మలో మునుగుతూ, అలా పైకి వస్తూ ఉదయిస్తున్న సూర్యుడిని చూసినప్పుడు అప్పటి అనుభూతి చెప్పలేనిది!


..మీ అనిల్

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

౨౧ఫిబ్రవరి౨౦౧౪, శుక్రవారం

ఎలాగైతేనేం? కాంగ్రెస్ తమ పని చేసుకుపోతూ, భా జ ప సహాయంతో తెలంగాణాని వేరు చేసేసింది.
అయితే తెలంగాణా రాకముందే "హైదరాబాదు" అనగానే ఏదో వేరే రాష్ట్రము లాగా ఉండేది. అక్కడికన్నా ఇక్కడ బెంగుళూరు చాలా నయ్యం! తెలంగాణా-సీమంధ్ర అని చూడకుండా ఎక్కడివారినైనా ప్రేమతో సొంత వారిలా చూస్తారు! అందుకే ఆ తలనొప్పి నుంచి దూరంగా ఇక్కడ బెంగళూరులో స్తిరపడిపోయాము! ఈ తెలంగాణా గొడవ వల్ల ఎక్కువ లాభం బెంగుళూరుకే వస్తుంది! ఒకరకంగా బెంగుళూరు తెలుగు వాళ్లకి రెండవ రాజధాని లాంటిది!
హైదరాబాద్ లో ఒకే భాష అయినా లాభం లేదు. ఒకే భాష అయినా తెలుగు భాష మీద మక్కువ ఏమాత్రం కనిపించదు, "అందరం తెలుగు వాళ్ళమే" అనే భావన ఏమాత్రం లేదు. తెలంగాణా వాళ్లకి, మిగతా తెలుగు వాళ్లకి మధ్య చిచ్చు పెట్టి ఎప్పుడో విడగొట్టారు. అక్కడ మాట్లాడితే "ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, ద్రోహులు, దొంగలు, రౌడీలు" తప్ప వేరే మాటలు రావు.
కాని ఇక్కడ అలా కాదు. ఇక్కడి వారికి మాతృభాష అంటే ప్రాణం. కర్ణాటకలో ఎన్నో భాషలు వున్నా అందరు కలిసి వుంటున్నారు. ఎందుకు? కలిసివుంటే కలదు సుఖం అని నమ్ముతారు కనక. మన నందమూరి తారక రామా రావు ఇక్కడి వారికి కూడా అన్న లాంటి వాడు.
ఇక్కడ వుండాలంటే ఇక్కడి వారి మాతృభాష కన్నడ మీద ప్రేమ, గౌరవం వుంటే చాలు. సొంత మనిషి లా చూస్తారు! ఇక్కడ వుంటే మన, ఇతర భాషల పైన మమకారం పెరుగుతుంది.
ఇక్కడ వుండటానికి కొంచెం కన్నడం, కొంచెం ఆంగ్లం వస్తే చాలు! భాష వేరైనా, మన వూరులా వుంటుంది!
ఉగాది పండగని కన్నడ, తెలుగు వారిద్దరూ కలిసి ఎంతో బాగా జరుపుకుంటారు. సంక్రాంతి కూడా అంతే.
ప్రేమ, ఉద్యోగాలకి అవకాశాలు, మంచి వాతావరణం, మన భాషని గౌరవిస్తూ అర్థం చేసుకుంటూ, తమ భాషని పుజిస్తూ వుండే ప్రజలు. అంతకంటే ఇంకేం కావాలి ఎవరికైనా?

..మీ అనిల్

21, జనవరి 2014, మంగళవారం

౨౦జనవరి౨౦౧౪, సోమవారం

నిన్న ఈనాడు వాహిని లో వచ్చిన "స్వరాభిషేకం" కార్యక్రమం లో పాడిన పాటలు ఎంత బాగున్నాయో చెప్పటానికి మాటలు చాలవు.
ఆకాశ దేశాన...
వేణువై వచ్చాను భువనానికి...

నాకు నచ్చే మరి కొన్ని అలనాటి పాటలు:
ఎవరికెవరు ఈ లోకం లో ఎవరికి..
ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి...


..మీ అనిల్

22, ఆగస్టు 2013, గురువారం

స్వాతంత్రము, సురాజ్యము, సులోచనము

ఈ రోజుల్లో భారత దేశానికి స్వాతంత్ర్యం ముఖ్యమా, సురాజ్యం ముఖ్యమా అంటే సురజ్యమే ముఖ్యం అని చెప్పాలి.
సురాజ్యమంటే ఒక మంచి పాలనా పక్షాన్ని ఎంచుకుని ప్రజలందరూ ప్రభుత్వాన్ని మంచి దారిలో నడిపించటం.
రామరాజ్యం అంటే ఎప్పుడో రాముడు గొప్పగా పాలించిన రాజ్యం మాత్రమె కాదు. ఈ యుగం లో కూడా ఎంతో మంది రాముల్లు వున్నారు. ఎంతో మంది మంచి జనం వున్నారు. కాని కొంతమంది మూర్ఖుల తప్పుడు నిర్ణయాల వలన, తప్పు బాట వలన సరైన పాలనా యంత్రాంగాన్ని మన చేతుల్లోకి తెచ్చుకోలేకపోతున్నాం.
ఎలాగైతే ఒక పంట చేతికి రావటానికి ఏంటో మంది కృషి వుంటుందో, మన దేశం మన చేతికి రావటానికి ఎంతో మంది కృషి, సరైన ఆలోచనలు, మార్గాదర్సికాలు ముఖ్యం.
ఉదాహరణకి తాము చేస్తున్నది సరైనదా, కాదా అని తెలుసుకోలేని వ్యక్తి తమ ప్రభుత్వాన్ని ఎలా ఎంచుకుంటాడు?
జనానికి డబ్బు పారేస్తే వోట్లు వాళ్ళే వేస్తారని నాయకులందరికీ తెలుసు. అలాగే ప్రజలకు కూడా తప్పు-వొప్పు అనేవి తెలియకుండా మూడ నమ్మకాలతో పోతున్నారు తప్ప అసలు నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనేది తెలుసుకోవట్లేదు.
తాము చేసే ప్రతి పనికీ ఒక ప్రతిఫలం వుంటుందని, దాన్ని చివరకు వాళ్ళే అనుభవించాలని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు సురాజ్యం వచ్చినట్టు.
అప్పుడు మన ఈ స్వాతంత్ర్యానికి విలువ వుంటుంది.


..మీ అనిల్

27, ఏప్రిల్ 2013, శనివారం

నలుపు - తెలుపు

ఒకసారి నలుపు-తెలుపు రంగులు తమలో ఏది గొప్ప అని పోట్లాడుకుంటున్నాయి.
ఈ రెండు రంగులకీ విశిష్టత వుంది. కానీ సృష్టి లో రంగులు అనేవి దేవుడు ఆడిన ఒక ఆట మాత్రమే.

అప్పుడు ఎలా వుందంటే(నేను వ్రాసిన ఒక చిన్న కవిత)...


నలుపు - తెలుపు

ఆట కదరా నలుపు ఆట కదరా తెలుపు

నలుపులో కల కలుగు, తెలుపులో కల కరుగు.
నలుపు-తెలుపుల మెలుగు.

మలచిన కురులు నలుపు, నిలిపిన ధ్యానము తెలుపు.
నలుపు-తెలుపుల మెరుపు.

కటిక చీకటి నలుపు, మృత్యువున తెర తెలుపు.
నలుపు-తెలుపుల కలుపు.

విరహ వేదన నలుపు, తెలియని వ్యధ తెలుపు.
నలుపు-తెలుపుల తలుపు.

కంటి కాటిక నలుపు, లగ్న పత్రిక తెలుపు.
నలుపు-తెలుపుల వలపు.

గ్రహణమున సూర్యుడు నలుపు, ఆ గ్రహణ కాంతులు తెలుపు.
నలుపు-తెలుపుల మలుపు.

శివదర్పణము నలుపు, క్షీరాభిషేకము తెలుపు.
నలుపు-తెలుపుల కలుపు.

మొండి పంతాలు నలుపు, వెర్రి సొంతాలు తెలుపు.
నలుపు-తెలుపుల వలపు.

మరణ శోకము నలుపు, జనన సంబరము తెలుపు.
నలుపు-తెలుపుల దరువు.

ఆట కదరా..ఆట కదరా..


..మీ అనిల్

13, ఫిబ్రవరి 2013, బుధవారం

మహాప్రస్థానం..

మహాకవి శ్రీ శ్రీ గారి అద్భుత రచన "మహాప్రస్థానం" ఒక "పీడీఎఫ్" రూపంలో అంతర్జాలంలో దొరికినందుకు సంతోషంగా వుంది! దాన్ని ఇక్కడ తీసుకోవచ్చు:
మహాప్రస్థానం.

..మీ అనిల్

౧౩ఫిబ్రవరి౨౦౧౩, బుధవారం

ఇప్పుడు మనం ఆంగ్లం నుంచి తెలుగు కి అనువదించాలంటే గూగుల్ లో ఈ క్రింది విధంగా వ్రాస్తే చాలు!
ఉదాహరణకు "పాలసీ" అనే ఆంగ్ల పదానికి తెలుగు అనువాదం: "విధానము"!



మీ అనిల్