28, ఏప్రిల్ 2012, శనివారం

౨౮ఏప్రిల్౨౦౧౨, శనివారం

మొన్న ఈ మధ్య "సి ఎన్ ఎన్ ఐ బి ఎన్" వాహిని లో బోఫోర్స్ కుంభకోణం మీద ఒక చర్చాగోష్తి చూసాను. అందులో ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న వారు ఎలా మాట్లాడుతున్నారంటే రాజీవ్ గాంధీ కి అసలు బోఫోర్స్ లో సంబంధమే లేదన్నట్టు చెప్తున్నారు! ఎవరి చెవిలో పువ్వు పెట్టాలని? పైగా స్విస్ రక్షణ అధికారి ఒకరు రాజీవ్ గురించి మాట్లాడాడని వారిని అర్థం లేని మాటలతో ముంచెత్తారు! "నెహ్రు పేరు ఎలా పిలవాలో తెలియని ఒక అపరిచితుడి మాటలు ఎందుకు నమ్మాలి?" అంట.
అబద్ధాన్ని నిజం చేయటం మోసం.
ఇలా ప్రజల్ని మోసం చేయటానికే అతను ఒక కేంద్ర మంత్రి అయితే ఎక్కడైనా ఒక బుల్లి గిన్నెలో నీళ్ళు నింపుకుని అందులో మునిగి చావమను! అలాగైనా ఈ భుఉమి మీద ఒకరి భారం తగ్గిద్ది!

..మీ అనిల్

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

౨౭ఏప్రిల్౨౦౧౨, శుక్రవారం

ఈ రోజే "దమ్ము" చిత్రం విడుదల! ఫేస్బుక్కులో ఎక్కడ చూసినా దాని గురించే సందేశాలు వున్నాయి. మొదటి సూచనల ప్రకారం ఈ చిత్రం విజయవంతం అవుతుందనే అనిపిస్తుంది!
ఎంతైనా రామ రావు కన్నా బాగా తెలుగు ఉచ్చరించగలిగిన వారు లేరు! అలాగే రామా రావు మనవడు కూడా అంతే బాగా మాట్లాడుతాడు!


..మీ అనిల్

26, ఏప్రిల్ 2012, గురువారం

౨౬ఏప్రిల్౨౦౧౨, గురువారం

"గురువారం మార్చి ఒకటి, సాయంత్రం..." ప్రతి గురువారం ఈ పాట గుర్తుకు వస్తుంది! ఆ పాటకున్న పేరు అలాంటిది మరి!!
జీవితంలో ఎంతో మంది ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతూ వుంటారు. మొన్న ఆదివారం "అయ్యారే" చిత్రం చూస్తున్నప్పుడు అనిపించింది:
"ఎవరినైనా నమ్ము, నమ్మకపో కాని ముందు నిన్ను నమ్ముకో" వివేకానందుడు చెప్పిన మాటలవి. కాని ఈ రోజుల్లో ఎంతో మంది నామ మాత్రానికి దేవుడికి మొక్కటం, సోది చెప్పించుకోవటం చేస్తున్నారు. మనకు దూరం గా సంబంధం లేని వాళ్ళు ఇలాంటివి చేస్తే పర్లేదు. కాని దెగ్గరగా వుండే వాళ్ళే ఇలాంటివి చేస్తే ఏమని చెప్పగలం?
"అయ్యారే" లో చెప్పింది కూడా అదే: మనల్ని మనం నమ్మనంత వరకు దొంగ బాబాలు, బూటకపు స్వాములు వస్తూనే వుంటారు.


..మీ అనిల్

23, ఏప్రిల్ 2012, సోమవారం

౨౨ఏప్రిల్౨౦౧౨, ఆదివారం

ఈ రోజు "అతిథి నువ్వెప్పుడు వెళ్తావు?"(హిందీ లో "అతిథి తుం కబ్ జావోగే?") చూస్తున్నాను! పరేష్ రావళ్ ఎప్పటిలాగే బాగా చేసారు! ఆయన చేసే ప్రతి పాత్రలో ఒక వైవిధ్యం, తన సొంత ముద్ర వేస్తారు!
ఈ వేసవి కాలం లో, అదీ బెంగుళూరు(సాధారణంగా చల్లగా వుండే ఊరు) లో ఇంత వేడిని తట్టుకోవటం మాటలు కాదు.
సాయంత్రం "మా" వాహినిలో వేసిన "అయ్యారే" చిత్రం బాగుంది. ఇందులో రాజేంద్ర ప్రసాదు గారు బాగా చేసారు. కథ కుడా బాగానే వుంది కాని పెద్ద నటీ నటులు లేకపోవటం వలన అంత బాగా ఆడివుండకపోవచ్చు.

..మీ అనిల్

17, ఏప్రిల్ 2012, మంగళవారం

౧౭ఏప్రిల్౨౦౧౨, మంగళవారం

ఈ రోజు మర్చిపోలేని రోజు! తొలకరి చినుకులు పడ్డాయి! ఆకాశం నుంచి జారిపడిన మొదటి చినుకులు భూమిని తాకితే వచ్చిన సువాసనలో, చల్లని గాలి వీస్తూ వున్న వేళ ఇంటికి దగ్గరయ్యాను! 
రెండు రోజులనుంచి ఆకాశాన సూర్యుడు సెలవు తీసుకున్నట్టు వుంది!
ఈ సమయాన నేను ౨౦౦౭లో ముంబైలో  వుంటున్నప్పుడు ఆంగ్లం లో వ్రాసిన ఒక కవిత గుర్తుకు వస్తుంది! ఆ కవిత చాలా మందికి బాగా నచ్చింది. అది ఇక్కడ వుంది.

..మీ అనిల్

16, ఏప్రిల్ 2012, సోమవారం

౧౬ఏప్రిల్౨౦౧౨, సోమవారం: పెద్ద చిత్రాల పండగ!

నాకు చలన చిత్రాలంటే ఒక రకమైన ఇష్టం. ఇష్టం అంటే అదే పనిగా ఏ చిత్రం వచ్చినా ఈలలు వెస్తూ చూసే రకం కాదు! పలానా చిత్రంలో ఎంత కళ వుంది, ఎంత మంచి నటన వుంది(ముఖ్యంగా ఆ చిత్రంలో కథానాయకుడు ఎంత బాగా సంభాషణలు చెప్పాడు, పాటల రచన,...) లాంటివి గ్రహిస్తాను, చూస్తాను. నిన్న జరిగిన "గబ్బర్ సింగ్" పాటల ఆవిష్కరణ ఉత్సవం చూసిన తర్వాత జనానికి నచ్చే ఒక మంచి చిత్రం వస్తుందని అనిపించింది. హిందీ భాషలో "దబంగ్" ఎలాగో చాలా మంది చూసేసి వుంటారు. దాని ప్రభావం ఈ చిత్రం భవిష్యత్తు పైన, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు పైన ఎంతైనా వుంటుంది.
వచ్చే నెల రోజుల్లో దమ్ము చిత్రం లాగా జనాన్ని అలరించే చిత్రాల పట్టికలో ఈ చిత్రం కూడా చేరిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోని సంభాషణలు అల వున్నాయి. అలాగే దేవి శ్రీ ప్రసాదు బాణీలు కొత్తగా, ఆకట్టుకునేలా వున్నాయి. ఈ పాటలను ఈ రోజు పొద్దున్న ప్రయాణిస్తున్నప్పుడు విన్నాను. బాగున్నాయి! అలాగే దమ్ము పాటలు కుడా ఉత్సాహాన్ని పెంచే రకంగా వున్నాయి.
ఇక రాజమౌళి "ఈగ" విషయానికి వస్తే అది ఈ రెండు చిత్రాలను తట్టుకుని ఎగరగలదో లేదో వేచి చూడాల్సిందే! ఎందుకంటే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ పెద్ద నటులు లేరు. అయినా రాజమౌళి చిత్రం అనగానే ప్రజలకు, అభిమానులకు ఎన్నో ఆశలు వుంటాయి! వాటిని తప్పకుండా అందుకుంటుందని అనిపిస్తుంది!

..మీ అనిల్

15, ఏప్రిల్ 2012, ఆదివారం

౧౫ఏప్రిల్౨౦౧౨, ఆదివారం

గత కొన్ని రోజుల నుంచి ఏదో తెలియని ఆరాటం, ఏదో కొత్త అనుభూతి రేగుతుంది. అది "హెచ్ టీ ఎం ఎల్" అనే భాషలో వ్రాసిన పుటలు సరిగ్గా రాకపోవటం కావొచ్చు, లేదా మిగిలి వున్నా కొన్ని పనులు సక్రమంగా జరగకపోవటం కావొచ్చు.
అనుకున్నట్టే భూకంపం గురించి వార్తలు-ప్రసారాల విభాగం వాళ్ళు అ నవసరమైన దృశ్య మాలికలను చూపించారు. అవి ప్రజలను తప్పు దారి పట్టించే విధంగా వున్నాయి. ఎప్పుడో ౨౦౦౪లొ జరిగిన దాని దృశ్యమాలికను చూపించి ఎక్కువ ప్రాచుర్యం పొందాలని ప్రయత్నించారు.
అయితే గురువారం "కే పీ ఐ టి" నుంచి ఉద్వాసన పత్రం తెచ్చుకున్నాను. దాంతో ఒక రకమైన చిన్న బరువు తగ్గినట్టు అయ్యింది! అయితే ముందు ముందు ఎన్నో జరగాల్సినవి వున్నాయి. అవన్నీ పధ్ధతి ప్రకారమే జరుగుతాయని, ఎటువంటి అడ్డంకులు రాకుండా, ఒకవేళ వచ్చినా ఎరుర్కొనే శక్తి ఉంటుందని ఆశిస్తున్నాను! :-) 

..మీ అనిల్

11, ఏప్రిల్ 2012, బుధవారం

౧౧ఏప్రిల్౨౦౧౨, బుధవారం

ఈ రోజు మా కార్యాలయం లో మధ్యాహ్న్నం ఒక చిన్న భూకంపం వచ్చింది. పద్ధతి ప్రకారం అందరం కొంచెం సేపు బయట నుంచుని మళ్లీ వచ్చి కూర్చున్నాము. వార్తలు చదువుతుంటే "అస్సలు వాళ్లకు ఇంతేనా తెలుసు?" అనిపిస్తుంది. ప్రతి విషయాన్ని స్పష్టంగా తప్పు లేకుండా ఎలా చెప్పాలో వాళ్లకి తేలీదు. ఒక్కోసారి వార్తల్లో చూపించే తప్పుడు బొమ్మలు ప్రజల్ని మోసం చేయటమే అవుతుంది. ఆంగ్ల చిత్రాలనుంచి తీసిన ఒక మంచి నమ్మసక్యంగా వుండే దృశ్య మాలికను చూపించి ఇదే నిజంగానే జరుగిందేమో అనిపించేలా డబ్బా కొడతారు. దాన్ని చూసిన అమాయక ప్రజలు అనవసరంగా కంగారు, భయపడతారు.
ఎప్పటికైనా ఇలాంటి వార్తలను చూపించే వాళ్ళందరూ మారతారని ఆశిస్తున్నాను.

..మీ అనిల్

8, ఏప్రిల్ 2012, ఆదివారం

౮ఏప్రిల్ ౨౦౧౨, ఆదివారం

ఈ రోజు ఎందుకో ఎమీ తోచలేదు. అందుకే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. వాయో లో కొత్తగా ఒక వెబ్ పత్రికను వ్రాసాను. దానితో సంఖ్యను నొక్కగలము, మార్చగలము!
తర్వాత ఈనాడు వాహినిలో వచ్చిన "బావ బావ పన్నీరు" చ లన చిత్రం భలేగా వుంది. హాస్యం అంటే అలా వుండాలి అనిపించింది! ఎంతైనా "అహా నా పెళ్ళంట" అంత నవ్వుల మయం కాదనుకోండి!


..మీ అనిల్

7, ఏప్రిల్ 2012, శనివారం

౭ఏప్రిల్౨౦౧౨, శనివారం: మహానుభూతి!

ఈ రోజు సాయంత్రం నా వాయోలో పెళ్లి దృశ్య మాలికని చూస్తున్న వేల ఆ సమయంలోని ఆ చిన్న చిన్న జ్ఞాపకాలు ఎందుకో ఒక వింత అనుభూని మిగిల్చాయి. పెళ్లి జరిగింది పోయిన సంవత్సరం అక్టోబర్ అయినా అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు, తెలిసిన ఎన్నో కొత్త విషయాలూ, ఇంకా ఎన్నో. కాలం తో పాటు పనిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. జీ తెలుగు వాహినిలో "కథానాయకుడు" చిత్రం మొదటిసారి చూసాను. పర్వాలేదనిపించింది.

ఇక ముందు ముందు చుడాలనుకునే చిత్రాలు: ఈగ, అమోఘమైన సాలీడుమనిషి(అమజింగ్ స్పైడర్మ్యాన్). ఈ రెండు చిత్రాల మీదా చాలా పెద్ద అంచనాలున్నాయి! అలాగే టైటానిక్ కి కూడా వెళదామనుకున్నా కుదరలేదు.
..మీ అనిల్

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

౬ఏప్రిల్౨౦౧౨, శుక్రవారం: బుల్లి పిడుగులు!

ఇదే చిన్నప్పుడు మా పల్లెటూరు(కొత్తపాలెం) లో బంధువులైన(తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరదళ్ళు, బావమర్దిలు!) చిన్న పిల్లల గురించి నేను వ్రాసిన కవిత(౨౦జూన్౨౦౦౦ న వ్రాసిన కవిత). ఇప్పుడు చదువుతుంటే నాకే నవ్వొస్తుంది! హహహ :-):

బుల్లి పిడుగులు!

అల్లరి చేస్తూ వేస్తారు అడుగులు
ముద్దొచ్చే ఈ బుల్లి పిడుగులు!
రాజాగా గోపాలుడు పుట్టాడు,
అల్లరి ఉద్యమం చేపట్టాడు
తనకుండదు విద్యార్థి అవ్వాలని,
తన ఉయ్యాల పరులకివ్వాలని!
చూచుటకు అమాయకురాలే కానీ
చేతల్లో తీసిపోదు రాణి
సుమంతుడు చిలిపి చేష్టలు తక్కువ,
అయినా మురిపించే మాటలు ఎక్కువ!
అమృత నోటి నుంచి వచ్చే నవ్వులు
పారిజాతం నుంచి రాలే పువ్వులు
భాగ్యనగరం వెళ్ళుట మౌనిక ఆశ
చివరకు మిగిలింది నిరాశ
క్రికెట్లో బంటి, విక్కిల ప్రతిభ
ఆటల్లో వారి నైపుణ్యానికి ప్రతీక!
ఈ పిడుగుల్లో కావ్య చేరింది
ఎదురులేని ఉత్సాహం చెలరేగింది
మున్ని వేస్తుంది రోజుకో ముగ్గు,
అనుషకి కొత్తపాలెం అంటేనే ముద్దు!
తొండి చేస్తే గీత అనేస్తుంది మాటలు
ఈమె ముందు సాగవు విక్కీ దొంగాటలు!


..మీ అనిల్

5, ఏప్రిల్ 2012, గురువారం

౫ఏప్రిల్౨౦౧౨, గురువారం: తెలుగు కథలు!

ఈ రోజు వెబ్ ప్రపంచంలో ఒక చాలా మంచి తెలుగు కథల సమూహాన్ని చూసాను. అది ఇక్కడ వుంది.
ఎప్పటినుంచో వెబ్ లో తెలుగు కథలు తీసుకుంటే బాగుండు అనిపిస్తూ వుండేది. ఎప్పుడూ ఆంగ్లం యేలుతూ వుండే ఈ లోకంలో మనకన్తూ ఒక సాహిత్యం, మనకంటూ ఒక కథల సమాహారం వుండటం ఎంతైనా అవసరం. ఈ రోజు నేను ఆ చిరునామా నుంచి చాలా పుస్తకాలను పొందు పరచాను. శ్రీ కృష్ణ లీలలు, భట్టి విక్రమార్కుని కథలు, పాపం తోడేలు, బహుమతి, నిజం, పంచతంత్రం లాంటివి ఎన్నో పొందు పరచాను.
గొప్ప సాహిత్య వేత్త అయ్యేంత వాడిని కాను కాని ఏదో నా వంతుగా ఒక చిన్న కథని అయినా వ్రాయాలని వుంది!
అయితే ఇప్పటికే ఇంతకు ముందు కొన్ని కవితలు వ్రాసాను. వాటిని తెలుగు వాహిని లో తప్పకుండా పెడతాను.
రేపు ఎలాగో శెలవు కాబట్టి తప్పకుండా నేను వ్రాసిన కవితలను ఇక్కడ పెడతాను.

..మీ అనిల్

4, ఏప్రిల్ 2012, బుధవారం

౪ఏప్రిల్౨౦౧౨, బుధవారం

కొన్ని సార్లు జీవితంలో వింత అనుభవాలు, అనుభూతులు, కొత్త ఆలోచనలు, కొత్త మాటలు వింటాము. అలంటి ఒక రోజే ఈ రోజు. ఎప్పుడూ లేని విడియం ఈ రోజు తెలిసినట్లుంది! ఉద్యోగం కోసం తమ వ్యక్తిగత జీవితాలలో దుఉరం పెరిగిపోతుందని శ్రీమతి బాధపడింది.అవును. నిజమే. కాని ఈ రోజుల్లో ఉద్యోగాలకు వెళ్ళే ప్రతి వ్యక్తికీ వుండే బాధ, కష్టం ఇదే. ఇంటికి, కార్యాలయానికి మధ్య దూరం వలన ఎందరూ తమ కుటుంబంతో సరిగ్గా సమయం గడపలేక పోతున్నారు. అయితే ఈ పరిస్థితికి సర్దుకుపోవడానికి, పరిష్కారం రావటానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటి దాకా ఓపిక పట్టాలి.

..మీ అనిల్

3, ఏప్రిల్ 2012, మంగళవారం

౩ఏప్రిల్౨౦౧౨, మంగళవారం

టాటా లో రెండవ రోజు! ఒకరకంగా ఈ వాతావరణానికి అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే పని చేసిన దాంట్లో వున్నపని సంస్కృతి, ఇక్కడి సంస్కృతి వేరు వేరుగా వున్నాయి. అక్కడ అంతా బొమ్మరిల్లు చలన చిత్రం లో లాగా అంతా మన పైవారు చెపినట్టు చేయాలని వుంటే, ఇక్కడ మన పనికి మనమే రాజులము, కార్మికులము, మంత్రులము, ప్రజలము!
ఏదేమైనా ఇక్కడ ఇంకా సర్డుకుపోవటానికి ఇంకా సమయం పడుతుంది. సంభాషణ ఖాతా ఇంకా పాత సంస్థ నుంచి కొన్ని పత్రికలూ రాలేదు. త్వరలోనే వస్తుందని భావిస్తున్నాను. లేకపోతే ఎవరితో మాట్లాడాలో తెలుసు.

..మీ అనిల్

2, ఏప్రిల్ 2012, సోమవారం

౨ఏప్రిల్౨౦౧౨, సోమవారం

ఈ రోజే నా కొత్త సంస్థ: "టాటా ఇ ఎల్ ఎక్స్ ఐ" లో చేరాను! చాలా కొత్తగా వుంది. అసలు పాత కార్యాలయానికి, ఈ కార్యాలయానికి చాలా తేడా వుంది! ఇక్కడ పని చేసే తీరు, చోటు ఎలా ఉన్నాయంటే ఒక విహార యాత్ర కి వచ్చినట్టు వుంది! మనస్సును ఆహ్లాదపరిచే విధంగా వుంది! అలాగని పని తక్కువ ని కాదండోయ్! తప్పుగా అనుకోకండి! చేతి నిండా పని వుంటుంది కాని ఎలా చేయాలో, కొత్త ఆలోచనలను ఎలా నిజం చేయాలో స్వేఛ్చ కూడా వుంటుంది!
అప్పుడే ఒక జట్టు సమావేశం కూడా పూర్తి అయ్యింది!

..మీ అనిల్

1, ఏప్రిల్ 2012, ఆదివారం

౧ఏప్రిల్౨౦౧౨, ఆదివారం: రామమయం!

ఈ రోజంతా రామమయం అయిపోయింది! పొద్దున్న మొదలైన కార్యక్రమాలు సాయంత్రం దాకా సాగుతూనే వున్నాయి!
ఇక్కడ అంత గొప్పగా చేసినట్టు వుండరు. ఎప్పటి లాగే ఈ సారి కూడా భద్రాచలం లో శ్రీ సీతారామచంద్ర కల్యాణం గొప్పగా చేసారు. అది కాక సాయంత్రం ఈనాడు లో చిన్నారులు శ్రీ రామరాజ్యం చలన చిత్రంలోని పాటలను భలేగా పాడారు.
రామాయణం సమయంలో వానరసేన కట్టిన వారధి అంటే ఎందుకో ఎప్పటినుంచో నాకు ఒక ఉత్సాహం వుంది.
ఎప్పుడైనా కుదిరితే రామేశ్వరం దెగ్గర శ్రీ లంక వెళ్ళే దారిలో సముద్రం లో మునిగి వున్న ఆ వారధిని చూడాలని వుంది!
ఇక్కడ కూడా కనీసం ఒక కల్యాణం లాంటిది చేస్తే బాగుండేది. కాని ఇక్కడ పానకం, పప్పులు పంచిపెట్టటం తప్ప ఎవ్వరూ ఎమీ చేయలేదు.

..మీ అనిల్