28, జూన్ 2012, గురువారం

౨౮జూన్౨౦౧౨, గురువారం

ఈ మధ్య పత్రికల్లో కథానాయకుల, కథానాయకిల గురించి వింత వింతగా వ్రాయటం మొదలు పెట్టారు. ఎలా వ్రాస్తున్నారు? ఇలా:
"...అసభ్యంగా నాగ్ హీరోయిన్..". ఇందులో కొంచెం అయినా అర్థం పర్థం ఉందా? ఇక్కడ మాట్లాడుతున్నది సుష్మిత సేన్ గురించి. కాని ఈ వార్తకి ఎటువంటి సంబంధం లేని  మన యువ సామ్రాట్ నాగార్జున పేరును ఎందుకు వాడుతున్నారు? ఇలాంటి వార్తలు చాలా వున్నాయి. "..రామ్ చరణ్ నటి ఆ చిత్రంలో..", లేదా "మహేష్ బాబు దర్శకుడు ఇందులో..", వగైరా, వగైరా..
ఎవరినైనా పేరు పెట్టి పిలిస్తే వీళ్ళ సొమ్మేం పోతుంది? అలా కాకుండా ఏదో ఒక చిత్రంలో ఆమె తనతో చేసింది కాబట్టి ఆ నాయకుడి పేరును పెట్టి ఇలా కథనాలు వ్రాయటం ఎంతవరకూ సమంజసం? ఇలా వ్రాయడం వలన ఆ పత్రిక వాళ్ళు తమని తాము అవమానిన్చుకున్నట్లే అవుతుంది.

..మీ అనిల్

24, జూన్ 2012, ఆదివారం

౨౪జూన్౨౦౧౨, ఆదివారం


కొన్ని సార్లు రాజకీయాలు మన వ్యక్తిగత జీవితంలో కుడా ప్రభావం చూపుతాయి. అలాంటి రాజకీయాల గురించి మనకి ఎన్నో విషయాలు నేర్పుతుంది మన మహాభారతం. శుక్రవారం రాత్రి భక్తి వాహినిలో చూసిన ఆంధ్ర మహాభారతంలో ఎన్నో విషయాల గురించి విశ్లేషణ చూపించారు. ఎలా పాలించాలి, ఎలా ప్రవర్తించాలి లాంటి ఎన్నో విషయాల గురించి మహాభారతంలో చెప్పిన విధంగా మరెక్కడా చెప్పలేదు. ఈ నాటి రాజకీయాలు ఎందుకు విఫలమవుతున్నాయి, మంచి సమాజానికి ఎంతో ముఖ్యమైన రాజకీయం ఎలా వుండాల్సినవి ఎలా అయిపోయాయి అనే విషయం పై తెలుస్తుంది. రాజకీయ శాస్త్రం అనేది కుడా వుందనేది చాలా మందికి తెలియదు! ఎవరికైనా రాజకీయం అనగానే గుర్తు వచ్చేది ఏంటంటే అది ఒక మురుగు గుంట అనుకుంటారు కానీ అలా అవటానికి కారణం మన నిర్లక్ష్యమే అనేది గుర్తు చేసుకోవాలి. "అయ్యో పాపం కారాగారంకి వెళ్లాడు, తండ్రి పోయాడు ఎలా" అంటూ మన మతాన్ని వేయడం, చీరలకు, మందుకు, మిగతావాటికి ఆశపడి అమ్ముడుపోవడం, మన విలువైన మతాన్ని అసమర్థులకు వేయటం లాంటివి ఎవరు చేస్తున్నారు? సామాన్య జనమేగా? చివరకు అనుభవించేది కుడా వీళ్ళే.


..మీ అనిల్

23, జూన్ 2012, శనివారం

౨౩జూన్౨౦౧౨, శనివారం


ఎన్నో రోజుల నుంచి వ్రాసే అంత మంచి శీర్షిక దొరకలేదు. ఈ రోజు "ఝుమ్మంది నాదం" చిత్రంలో చివరగా వచ్చే పాటలోని సాహిత్యం విని ఆశ్చర్యపోయాను. దేశం గురించి ఇంత మంచి సందేశం వున్న పాట ఈ రోజుల్లోని చిత్రాల్లో చూడలేదు! ఈ చిత్రం ఇంతకు ముందు చూసాను కానీ ఈ చివరి పాట సరిగ్గా చూడలేదు.
మహా కవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు వ్రాసిన "దేశమంటే మట్టికాదోయి" పాటను స్పూర్తిగా తీసుకుని వ్రాసిన ఈ పాటలోని కొన్ని మాటలు నాకు బాగా నచ్చాయి! "తీవ్రవ్యాదిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్", "గడ్డినుంచి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్", "అబలపై ఆమ్లాన్ని చాల్లే అరాచకమే కాదు కాదోయ్", "చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్", "సంది దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్","ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్" లాంటి ఎన్నో అంశాలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
ఇంత మంచి అర్థం, సందేశం వున్న పాట వ్రాసిన చంద్రబోస్ గారికి, ఆ పాటని బాలు గారితో అంత గొప్పగా పాడించిన కీరవాణి గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.


..మీ అనిల్

4, జూన్ 2012, సోమవారం

౪జూన్౨౦౧౨, సోమవారం:

ఈ రోజు స్వర గంధర్వుడు పద్మశ్రీ డా. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి జన్మ దినం! ఎప్పటి లాగే ఈనాడు వాహినిలో వచ్చే "పాడుతా తీయగా" కార్యక్రమాన్ని తప్పకుండా చూడాలని వుంది. పైగా విజేతలు ఎవరో ఈ వారం లేదా వచ్చే వారం తెలియబోతుంది! అంతే కాకుండా బాలు గారు చెప్పే విషయాలు చాలా కొత్తగా, తెలుగుదనం ఉట్టిపడేలా స్పష్టంగా వుంటాయి. ఈ నాటి గాయని-గాయకులకు ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో వున్నాయి!
వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన గాయని హరిణి, మరియు గాయకుడు రోహిత్ . మరి వాళ్ళు గెలుస్తారో లేదో చూడాలి!

ఇక మిగతా విషయాల గురించి వ్రాయాలంటే సోనీ తయారు చేసే ఎన్నో ఫోన్ల గురించి ఒక విషయం చెప్పాలి.
వాటి నాణ్యత బాగానే వున్నా, వాటిల్లో సోనీ వాళ్ళ ఆస్తులు అయిన "వాక్మాన్", "సైబర్ షాట్", "ప్లే స్టేషన్", వగైరా అన్నీ ఒకే ఫోన్లో ఎందుకు వాడట్లేదో  వుంది. ఒక దాంట్లో  ఇంకొక దాంట్లో లేదు. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో అప్పుడు వాటి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.

..మీ అనిల్