22, ఆగస్టు 2013, గురువారం

స్వాతంత్రము, సురాజ్యము, సులోచనము

ఈ రోజుల్లో భారత దేశానికి స్వాతంత్ర్యం ముఖ్యమా, సురాజ్యం ముఖ్యమా అంటే సురజ్యమే ముఖ్యం అని చెప్పాలి.
సురాజ్యమంటే ఒక మంచి పాలనా పక్షాన్ని ఎంచుకుని ప్రజలందరూ ప్రభుత్వాన్ని మంచి దారిలో నడిపించటం.
రామరాజ్యం అంటే ఎప్పుడో రాముడు గొప్పగా పాలించిన రాజ్యం మాత్రమె కాదు. ఈ యుగం లో కూడా ఎంతో మంది రాముల్లు వున్నారు. ఎంతో మంది మంచి జనం వున్నారు. కాని కొంతమంది మూర్ఖుల తప్పుడు నిర్ణయాల వలన, తప్పు బాట వలన సరైన పాలనా యంత్రాంగాన్ని మన చేతుల్లోకి తెచ్చుకోలేకపోతున్నాం.
ఎలాగైతే ఒక పంట చేతికి రావటానికి ఏంటో మంది కృషి వుంటుందో, మన దేశం మన చేతికి రావటానికి ఎంతో మంది కృషి, సరైన ఆలోచనలు, మార్గాదర్సికాలు ముఖ్యం.
ఉదాహరణకి తాము చేస్తున్నది సరైనదా, కాదా అని తెలుసుకోలేని వ్యక్తి తమ ప్రభుత్వాన్ని ఎలా ఎంచుకుంటాడు?
జనానికి డబ్బు పారేస్తే వోట్లు వాళ్ళే వేస్తారని నాయకులందరికీ తెలుసు. అలాగే ప్రజలకు కూడా తప్పు-వొప్పు అనేవి తెలియకుండా మూడ నమ్మకాలతో పోతున్నారు తప్ప అసలు నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనేది తెలుసుకోవట్లేదు.
తాము చేసే ప్రతి పనికీ ఒక ప్రతిఫలం వుంటుందని, దాన్ని చివరకు వాళ్ళే అనుభవించాలని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు సురాజ్యం వచ్చినట్టు.
అప్పుడు మన ఈ స్వాతంత్ర్యానికి విలువ వుంటుంది.


..మీ అనిల్

27, ఏప్రిల్ 2013, శనివారం

నలుపు - తెలుపు

ఒకసారి నలుపు-తెలుపు రంగులు తమలో ఏది గొప్ప అని పోట్లాడుకుంటున్నాయి.
ఈ రెండు రంగులకీ విశిష్టత వుంది. కానీ సృష్టి లో రంగులు అనేవి దేవుడు ఆడిన ఒక ఆట మాత్రమే.

అప్పుడు ఎలా వుందంటే(నేను వ్రాసిన ఒక చిన్న కవిత)...


నలుపు - తెలుపు

ఆట కదరా నలుపు ఆట కదరా తెలుపు

నలుపులో కల కలుగు, తెలుపులో కల కరుగు.
నలుపు-తెలుపుల మెలుగు.

మలచిన కురులు నలుపు, నిలిపిన ధ్యానము తెలుపు.
నలుపు-తెలుపుల మెరుపు.

కటిక చీకటి నలుపు, మృత్యువున తెర తెలుపు.
నలుపు-తెలుపుల కలుపు.

విరహ వేదన నలుపు, తెలియని వ్యధ తెలుపు.
నలుపు-తెలుపుల తలుపు.

కంటి కాటిక నలుపు, లగ్న పత్రిక తెలుపు.
నలుపు-తెలుపుల వలపు.

గ్రహణమున సూర్యుడు నలుపు, ఆ గ్రహణ కాంతులు తెలుపు.
నలుపు-తెలుపుల మలుపు.

శివదర్పణము నలుపు, క్షీరాభిషేకము తెలుపు.
నలుపు-తెలుపుల కలుపు.

మొండి పంతాలు నలుపు, వెర్రి సొంతాలు తెలుపు.
నలుపు-తెలుపుల వలపు.

మరణ శోకము నలుపు, జనన సంబరము తెలుపు.
నలుపు-తెలుపుల దరువు.

ఆట కదరా..ఆట కదరా..


..మీ అనిల్

13, ఫిబ్రవరి 2013, బుధవారం

మహాప్రస్థానం..

మహాకవి శ్రీ శ్రీ గారి అద్భుత రచన "మహాప్రస్థానం" ఒక "పీడీఎఫ్" రూపంలో అంతర్జాలంలో దొరికినందుకు సంతోషంగా వుంది! దాన్ని ఇక్కడ తీసుకోవచ్చు:
మహాప్రస్థానం.

..మీ అనిల్

౧౩ఫిబ్రవరి౨౦౧౩, బుధవారం

ఇప్పుడు మనం ఆంగ్లం నుంచి తెలుగు కి అనువదించాలంటే గూగుల్ లో ఈ క్రింది విధంగా వ్రాస్తే చాలు!
ఉదాహరణకు "పాలసీ" అనే ఆంగ్ల పదానికి తెలుగు అనువాదం: "విధానము"!



మీ అనిల్

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

౮ఫిబ్రవరి౨౦౧౩, శుక్రవారం: గుర్తుకువస్తున్న సీతమ్మ వాకిట్లో..!

కొన్ని సార్లు మన జీవితంలోకి ఎన్నటికీ మరచిపోలేని కొన్ని అనుభూతులు వస్తాయి. అలాంటి అనుభూతి నిన్న వచ్చింది. సమాజం గురించి ఎప్పుడూ చెడుగా అనుకునే ఈ లోకంలో ఈ సమాజాన్ని ఒక మంచి దృష్టి తో చూడటం అనేది చాలా గొప్ప విషయం. అదే "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం లో చూపించారు!
"మనుషులు మంచి వాల్లురా!" అంటూ సమాజం పట్ల ఒక మంచి అనుకూల వైఖరి చూపించిన మొదటి చిత్రం ఇది!
నిన్న ఒకరిని చూసి నాకు అలాగే అనిపించింది! ఎప్పుడో నెల క్రితం చూసిన ఒకతను నన్ను ఒక చిరు నవ్వుతో గుర్తుపట్టాడు! చెప్పటానికి మా ఇద్దరి మధ్య ఎటువంటి బంధుత్వము, అనుబంధము లేదు. ఆ నవ్వులో ఏదో తెలియని సంతోషం వుంది! ముందు ఆ పెద్ద మనిషి నన్ను గుర్తు పట్టడేమో అనుకుని చూడనట్లు వున్నాను! కానీ ఎందుకో మరో సారి వెనక్కి చూస్తే ఆయన నావంక నవ్వుతూ చేయి చూపారు!


..మీ అనిల్

6, ఫిబ్రవరి 2013, బుధవారం

౬ఫిబ్రవరి౨౦౧౩, బుధవారం

నాకు ఇష్టమైన ముల్లపూడి వెంకటరమణ గారి "బుడుగు"లో కొంత భాగం!

ఇందిర అనే రెండు జడల సీత ఖధ
ఒక బాబాయీ, ఇంకో ఆరు బాబాయిలూ, నేనూ కలిసి ఆ ఆడబడికి వెళ్ళామా.
అప్పుడు ఇందిర వచ్చింది కదా. రెండుజడలు వేసుకుందా మరి. ఇందిర అంటే కాలేజీ అమ్మాయి అని అర్థం.
ఈ ఇందిరేమో వాళ్ళకి తెలీదు. మరి యెలా మాటాడ్డం ?
ఒక బాబాయేమో నన్ను పిలిచి వురేయ్ సత్తరకాయీ సత్తరకాయీ మరేమో నువ్వూ ఈల వేసి ఇందిరని పిలవరా అన్నాడు.
నన్ను కొట్టుతుంది బాబూ అని చెప్పాను.
అయినా ఫరవాలేదులే అన్నాడు వాడు.
ఫరవాలేదులే అంటే కొట్టితే కొట్టనీ అని అర్థం.  
నేను మెల్లిగా ఈల వేశాను.
అలా కాదు గాఠిగా వెయ్యాలి. వేసి రెండు జెడల పిల్లా అని పిలవాలీ అన్నాడు వాడు. సరేగదా పాపం అని నేనూ అలా పిలిచాను గదా.
అప్పుడేమో ఆ యిందిర ఘబుక్కుని ఇటువేపు తిరిగి ఫోకిరీవాడులారా అనేసింది.
కాని అప్పుడు చూస్తే ఒక బాబాయీ లేడు. ప్పది బాబాయిలు కూడా అక్కడ లేరు. వాళ్ళు అందరూ గట్టుమీద కూచున్నారు.
నేను ఒక్కడే అక్కడ ఉన్నాడు.
నేను హాచ్చర్యపడిపోయేశాను.
ఇందిర కూడా హాచ్చర్యపడేసింది.
హారి నువ్వా పిడుగూ అంది.
నా పేరు బుడుగు. నువ్వే హారి పిడుగు అని చెప్పాను.
ఫోకిరీ పిల్లాడా అంది.
నువ్వే ఫొకిరి పిల్లాడా అని చెప్పేశాను నేను.
మరీ నన్ను రెండు జెడలు అని ఎందుకు పిలిచావు అంది.
నీకు రెండు జెడలు ఉన్నాయిగా అందుకని అని చెప్పేశాను.
ఉంటే నీకేం అంది.
ఉంటే నీకేం అంటే నాకు తెలీదు అని చెప్పేను.
తెలీకపోతే, ఇదిగో ఇదీ అనేసి, ఆ ఇందిర నా గుండు మీద మొట్టికాయ కొఠేసింది.
అయినా కోపం పోలేదు. అందుకని యిలా కింద కూచుని ముద్దు పెఠేసుకుంది. అప్పుడు సీగానపెసూనాంబ చూడలేదనుకో.
చూత్తే వెక్కలిత్తుంది.
మా  బామ్మా, అమ్మా అంతే. ఒక్కోసారి సీగానపెసూనాంబ చూస్తున్నప్పుడే నను బంగారు  తండిరీ అంటారు. అంటే ఫరవాలేదనుకో కాని ముద్దు కూడా పెఠేసుకుంటారు.
అప్పుడు సీగానపెసూనాంబ డిల్లమ్మా డిల్ల అని వెక్కిరిస్తుంది. అప్పుడు అమ్మ ఘబుక్కున దాన్ని కూడా పట్టుకుని ముద్దు పెఠేసుకుంటుంది.
అయిందా పెళ్ళి అని ఏడిపిస్తాననుకో అప్పుడు నేను.

..మీ అనిల్