27, ఏప్రిల్ 2013, శనివారం

నలుపు - తెలుపు

ఒకసారి నలుపు-తెలుపు రంగులు తమలో ఏది గొప్ప అని పోట్లాడుకుంటున్నాయి.
ఈ రెండు రంగులకీ విశిష్టత వుంది. కానీ సృష్టి లో రంగులు అనేవి దేవుడు ఆడిన ఒక ఆట మాత్రమే.

అప్పుడు ఎలా వుందంటే(నేను వ్రాసిన ఒక చిన్న కవిత)...


నలుపు - తెలుపు

ఆట కదరా నలుపు ఆట కదరా తెలుపు

నలుపులో కల కలుగు, తెలుపులో కల కరుగు.
నలుపు-తెలుపుల మెలుగు.

మలచిన కురులు నలుపు, నిలిపిన ధ్యానము తెలుపు.
నలుపు-తెలుపుల మెరుపు.

కటిక చీకటి నలుపు, మృత్యువున తెర తెలుపు.
నలుపు-తెలుపుల కలుపు.

విరహ వేదన నలుపు, తెలియని వ్యధ తెలుపు.
నలుపు-తెలుపుల తలుపు.

కంటి కాటిక నలుపు, లగ్న పత్రిక తెలుపు.
నలుపు-తెలుపుల వలపు.

గ్రహణమున సూర్యుడు నలుపు, ఆ గ్రహణ కాంతులు తెలుపు.
నలుపు-తెలుపుల మలుపు.

శివదర్పణము నలుపు, క్షీరాభిషేకము తెలుపు.
నలుపు-తెలుపుల కలుపు.

మొండి పంతాలు నలుపు, వెర్రి సొంతాలు తెలుపు.
నలుపు-తెలుపుల వలపు.

మరణ శోకము నలుపు, జనన సంబరము తెలుపు.
నలుపు-తెలుపుల దరువు.

ఆట కదరా..ఆట కదరా..


..మీ అనిల్