26, ఏప్రిల్ 2014, శనివారం

౨౬ఏప్రిల్౨౦౧౪, శనివారం: కిన్నెరసాని!

ఇప్పుడే మా మరదలు అంతర్జాలం లో పంపిన ఒక అందమైన, చిన్న పాటని చదివాను! అది ఇదే:

కిన్నెరసానికి వన్నెలు కూర్చిన వయ్యరమే నీవా!
తొలిగా వీచిన సూర్యుని వెచ్చని వేకువ రేఖవా!
బ్రహ్మను మించిన బాపు సృష్టికి రుపానివి నీవా!
వెలిగే తెలుగింటి అమ్మకు నుదుటిన రంగుల ముగ్గువా!
అందరాని ఊహవా? అందమైన తోడువా?

ఇది ఏ చలన చిత్రంలోనిదో తెలీదు కాని, చదవటానికి బాగుంది! ఇందులో "తొలిగా వీచిన సూర్యుని వెచ్చని వేకువ.." నాకు బాగా నచ్చింది! ఉదయాన్నే చూసే మొదటి సూర్య కిరణం ఎప్పటికీ మర్చిపోలేము. ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు మామూలు అనిపించొచ్చు కాని ఉదయిస్తున్న సూర్యుడిని చూసే క్షణాలు అమూల్యమైనవి! ౨౦౦౪ లో కృష్ణ పుష్కరాలు జరిగినప్పుడు కృష్ణమ్మలో మునుగుతూ, అలా పైకి వస్తూ ఉదయిస్తున్న సూర్యుడిని చూసినప్పుడు అప్పటి అనుభూతి చెప్పలేనిది!


..మీ అనిల్