21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

౨౧ఫిబ్రవరి౨౦౧౪, శుక్రవారం

ఎలాగైతేనేం? కాంగ్రెస్ తమ పని చేసుకుపోతూ, భా జ ప సహాయంతో తెలంగాణాని వేరు చేసేసింది.
అయితే తెలంగాణా రాకముందే "హైదరాబాదు" అనగానే ఏదో వేరే రాష్ట్రము లాగా ఉండేది. అక్కడికన్నా ఇక్కడ బెంగుళూరు చాలా నయ్యం! తెలంగాణా-సీమంధ్ర అని చూడకుండా ఎక్కడివారినైనా ప్రేమతో సొంత వారిలా చూస్తారు! అందుకే ఆ తలనొప్పి నుంచి దూరంగా ఇక్కడ బెంగళూరులో స్తిరపడిపోయాము! ఈ తెలంగాణా గొడవ వల్ల ఎక్కువ లాభం బెంగుళూరుకే వస్తుంది! ఒకరకంగా బెంగుళూరు తెలుగు వాళ్లకి రెండవ రాజధాని లాంటిది!
హైదరాబాద్ లో ఒకే భాష అయినా లాభం లేదు. ఒకే భాష అయినా తెలుగు భాష మీద మక్కువ ఏమాత్రం కనిపించదు, "అందరం తెలుగు వాళ్ళమే" అనే భావన ఏమాత్రం లేదు. తెలంగాణా వాళ్లకి, మిగతా తెలుగు వాళ్లకి మధ్య చిచ్చు పెట్టి ఎప్పుడో విడగొట్టారు. అక్కడ మాట్లాడితే "ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, ద్రోహులు, దొంగలు, రౌడీలు" తప్ప వేరే మాటలు రావు.
కాని ఇక్కడ అలా కాదు. ఇక్కడి వారికి మాతృభాష అంటే ప్రాణం. కర్ణాటకలో ఎన్నో భాషలు వున్నా అందరు కలిసి వుంటున్నారు. ఎందుకు? కలిసివుంటే కలదు సుఖం అని నమ్ముతారు కనక. మన నందమూరి తారక రామా రావు ఇక్కడి వారికి కూడా అన్న లాంటి వాడు.
ఇక్కడ వుండాలంటే ఇక్కడి వారి మాతృభాష కన్నడ మీద ప్రేమ, గౌరవం వుంటే చాలు. సొంత మనిషి లా చూస్తారు! ఇక్కడ వుంటే మన, ఇతర భాషల పైన మమకారం పెరుగుతుంది.
ఇక్కడ వుండటానికి కొంచెం కన్నడం, కొంచెం ఆంగ్లం వస్తే చాలు! భాష వేరైనా, మన వూరులా వుంటుంది!
ఉగాది పండగని కన్నడ, తెలుగు వారిద్దరూ కలిసి ఎంతో బాగా జరుపుకుంటారు. సంక్రాంతి కూడా అంతే.
ప్రేమ, ఉద్యోగాలకి అవకాశాలు, మంచి వాతావరణం, మన భాషని గౌరవిస్తూ అర్థం చేసుకుంటూ, తమ భాషని పుజిస్తూ వుండే ప్రజలు. అంతకంటే ఇంకేం కావాలి ఎవరికైనా?

..మీ అనిల్