31, జులై 2012, మంగళవారం

౩౧జులై౨౦౧౨, మంగళవారం: శోభన్ బాబు- సోగ్గాడు!

ఆదివారం(౨౯జులై౨౦౧౨) జీ తెలుగులో వచ్చిన "శోభన్ బాబు వజ్రోత్సవం" చాలా బాగుంది. అంత అందం, విభిన్నత, అన్ని విజయాలు, ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్న ఒక గొప్ప నటుడి గురించి ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. పెద్ద నటీ-నటులు వాటిని గుర్తు తెచ్చుకుని చెప్తుంటే ఒక కొత్త అనుభూతి కలిగింది!
నేను ఒక చలన చిత్ర మందిరంలో చూసిన శోభన్ బాబు చిత్రం "ఏవండీ ఆవిడ వచ్చింది!"(ఆయన చివరి చిత్రం).
అందులో ఎంత బాగా చేసారో, అందం, ఇద్దరి భామల మధ్య చేసిన అల్లరి, పండించిన నవ్వులు, ఆయన్ని చూసి జనం కొట్టిన చప్పట్లు, ఈలలు అంత-ఇంతా కాదు! ఆ రోజులే వేరు!
తెలుగు చలన చిత్ర రంగానికి రామా రావు, అక్కినేని రెండు కళ్ళైతే, కృష్ణ, శోభన్ బాబు మరో రెండు కళ్ళు! నిజమే!
శోభన్ బాబు గారి అబ్బాయి కుడా ఆయనలాగే వుండటం, మాట్లాడటం మొదటి సారి చూసాను!
ఆ పూర్తి సన్మాన కార్యక్రమం ఒక మరువలేని అనుభవం! అంత పెద్ద వాళ్ళందరినీ ఒకే వేదిక మీద చూడగలగటం, శోభన్ బాబు గారితో వారి జ్ఞాపకాలు వింటుంటే మనసు పులకరించింది.

..మీ అనిల్

30, జులై 2012, సోమవారం

౩౦జులై౨౦౧౨, సోమవారం: "ఐ గాడిద"!

ఈ రోజుల్లో వస్తువులను ఎన్నో రకాలుగా, ఆకర్షనీయంగా అమ్ముతునారు! వీటిలో ఎమీ లేకపోయినా ఏదో గొప్ప విషయం వున్నట్టు చూపించి, ప్రజలను మాయచేసి ఎలాగైనా కొనేలా చేస్తారు! అలాగని అన్ని సంస్థలు ఇలాగే చేస్తాయని కాదు. కొన్ని సంస్థలు ఎలాంటి వస్తువుకైనా హంగులు వేసి అమ్మేలా చేస్తారు! అలాంటిదే ఈ కింది గాడిద!






..మీ అనిల్

౩౦జులై౨౦౧౨, సోమవారం: ఈగ ఈగ ఈగ!(కవిత)




రాజమౌళి "ఈగ" చిత్రం మీద ఒక చిన్న కవిత వ్రాయాలనిపించింది, వ్రాసాను!:

ఈగ ఈగ ఈగ!

రేణువంత వున్న ఒక గరుడలా
ఎర్రని కళ్ళలో కసి దాగివున్న
శత్రురాక్షసుని అంతిమ క్షణంలో
కనిపించే గోరంత యముడిలా
౬ కళ్ళ చిన్న గ్రహాంతర్వాసిలా
ఎగిరే ఒక మారణాయుధంలా
కండ బలాన్ని అంతంచేసే
గుండె బలంతో వచ్చిందిరా
మహా వేగాన్ని సొంతం చేసుకున్న
చిట్టి విమానంలా దూసుకువచ్చిందిరా
మన ఈగ ఈగ ఈగ!

మరువలేని అద్భుతాల మాయగాడిలా
ప్రేయసి రక్షణకై వచ్చిన మగాడిలా
సూదిని కుడా అస్త్రంలా వాడే వీరుడిలా
చావుని లెక్కచేయని మగదీరుడిలా
పగతో మండుతున్న అగ్నిగుండంలా
ప్రతీకారం తీసుకునే పిడుగులా
రెక్క విరిగినా పోటీ వీడని విక్రమార్కుడిలా
పొందలేని ప్రేమని కాపాడుకోవటానికి
కాలభైరవునిలా మళ్లి ఎగిరి వచ్చిందిరా
మన ఈగ ఈగ ఈగ!

తింటే పరమాన్నం తినాలిరా
వింటే భారతం వినాలిరా
తాగితే పానకం తాగాలిరా
పాడితే బాలు లా పాడాలిరా
కొడితే "పోకిరి" పండులా కొట్టాలిరా
నవ్వితే మహేష్ లా నవ్వాలిరా
గంతులేస్తే చిరు లా వేయాలిరా
కానీ చుస్తే ఈగనే చూడాలిరా
మన ఈగ ఈగ ఈగ!




..మీ అనిల్

13, జులై 2012, శుక్రవారం

౧౩జులై౨౦౧౨, శుక్రవారం

బాగా ప్రచారం జరిగిన ఒక మంచి చిత్రానికి ప్రజలు విజయ రథం పడటారంటానికి ఈగ ఘన విజయమే సాక్ష్యం!
రాజమౌళి చెప్పినట్టే అన్ని పనులూ సక్రమంగా చేయటం వలనే ఈ చిత్రం ఇంత గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటిది మంచి కథనం, అందులో కొత్తదనం, అనుకున్నది వచ్చేదాకా నిజాయితీగా పని చేయటం, పెద్ద కథానాయకుడు లేనందున అన్ని మాధ్యమాలలొనూ బాగా ప్రచారం చేయటం, అన్నీ కలిస్తేనే ఈగ లాంటి గొప్ప చిత్రం వచ్చింది. ఈ చిత్రంతో దర్శకుడి ప్రతిభతో, కష్టంతో ఎంతటి విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చని రుజువు చేసాడు మన "చలన చిత్ర శిల్పి" జక్కన్న!

ఒక నటుడికి దర్శకుడు గురువు లాంటి వాడు. నటులు దర్శకుని శిష్యులు. అలాగే నటులందరికీ ప్రజలు తల్లి-తండ్రుల్లాంటి వాళ్ళు! ఎందుకంటే మన కథా నాయకుడు ఎలా కనిపించాలో అలా కనిపించకపోతే ప్రజలు నిరాశ చెందుతారు! కాబట్టి తల్లి-తండ్రులకు నచ్చినట్టు పిల్లలు వుండకపోతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తారు!
అలాగని కథానాయకులు కొత్తగా కనిపించకూడదు అని కాదు. ప్రజల్ని మెప్పించి తమని తాము నిరూపించుకుంటే తప్పకుండా ప్రజలు బ్రహ్మరథం పడతారు!
ఈగ గుయ్యిమంటూ అందనంత ఎత్తుకు ఎగురుతున్న ఈ సమయంలో నాకొక భావం వచ్చింది! ఆలోచిస్తే నిజమే అనిపించింది. అదే:
ఒక నటుడికి దర్శకుడు గురువు లాంటి వాడు. నటులు దర్శకుని శిష్యులు. అలాగే నటులందరికీ ప్రజలు తల్లి-తండ్రుల్లాంటి వాళ్ళు! ఎందుకంటే మన కథా నాయకుడు ఎలా కనిపించాలో అలా కనిపించకపోతే ప్రజలు నిరాశ చెందుతారు! కాబట్టి తల్లి-తండ్రులకు నచ్చినట్టు పిల్లలు వుండకపోతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తారు!
అలాగని కథానాయకులు కొత్తగా కనిపించకూడదు అని కాదు. ప్రజల్ని మెప్పించి తమని తాము నిరూపించుకుంటే తప్పకుండా ప్రజలు బ్రహ్మరథం పడతారు!


..మీ అనిల్

8, జులై 2012, ఆదివారం

౮ జులై ౨౦౧౨, ఆదివారం: ఈగ ఈగ ఈగ!


 ఈగ ఈగ ఈగ! యముడి మెరుపు తీగ! ఈగ అనేది ఒక చలన చిత్రం మాత్రమే కాదు! ఒక జరగబోయే సంచలనం. తెలుగు చిత్ర పరిశ్రమలో మొలకెత్తిన ఒక అద్భుతం! ఈగ ని ఎంత బాగా తయారు చేసారనేది ఒక విషయం అయితే ఆ ఈగని అంత బాగా నటింపచేసిన దర్శకుడు రాజమౌళికి జోహార్లు!
నేను అనుకున్న దానికంటే ఇంకా గొప్పగా తీసారంటే ఆ ఘనత రాజమౌళి గారిదే! ఎంతో మంది మన తెలుగు చలన చిత్ర రంగానికి వచ్చి ఏవేవో చేయాలనుకుంటారు. ఎన్నో గొప్ప చిత్రాలను తీసి తమ కల నిజం చేసుకోవాలనుకుంటారు. అలాటి కళాకారులకు
ఈగ ఒక మంచి స్పూర్తి కావాలి. ఈగ ఒక్క సంభాషణ కుడా లేకుండా కేవలం తన కదలికలతో మన మనసులను తాకగాలిగిందంటే, మనసులోని భావాలను వ్యక్తపరచగలిగిందంటే దానికి కారణం రాజమౌళి, మకుట లో పని చేసిన వాళ్ల కష్ట ఫలితమే!!
కష్టం తో పని చేసిన వాళ్లకి ఫలితం అన్నిటికన్నా తీయగా వుంటుందంటారు! ఇప్పుడు వాళ్ళు కుడా మన ఈగకు వస్తున్న అభినందనలను చుసి సంతోషం తట్టుకోలేక ఆనంద భాష్పాలు చిందించినా ఆశ్చర్యపడనక్కర్లేదు! ఎక్కడ చూసినా ఈగను ఇంత బాగా
తీసినందుకు అభినందనల జల్లులే! అసలైన వర్షాలు పడకపోయినా ఈ ఈగ ఆనందపు జల్లులు ఇప్పట్లో ఆగవని నా అభిప్రాయం. ఈగ ఒక సారి చూస్తే సరిపోయే చిత్రం కాదు.
శనివారం పొద్దున్న ఊర్వశి చిత్ర మందిరంలో ఈగ ని చూడటానికి వచ్చిన జనం అంతా ఇంతా కాదు! కిక్కిరిసిపోయిన ఆ జనం మధ్య ఒక చిత్రం చూడటమే ఒక గొప్ప అనుభూతి! ఇక రాజమౌళి చిత్రం అంటే చెప్పనక్కర్లేదు! ఇక చిత్రం మొదలై శుభం వచ్చే దాకా
అందరూ చప్పట్లు కొడుతూ, నవ్వుతూ ఆస్వాదించారు!


..మీ అనిల్

3, జులై 2012, మంగళవారం

౩జులై౨౦౧౨, మంగళవారం: నేడే మహా నటుని జయంతి!

ఈ రోజే స్వర్గీయ సామర్ల వెంకట రంగారావు(మన ఎస్వి రంగా రావు) జయంతి!! ఆయన గురించి ఒక పత్రిక చదివాను:
సామర్ల వెంకట రంగారావు(౩ జులై ౧౯౧౮ - ౧౮ జులై ౧౯౭౪)
  

పై కథనాన్ని ప్రచురించిన అఖిలాంధ్ర వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు!


..మీ అనిల్

1, జులై 2012, ఆదివారం

౩౦జూన్౨౦౧౨, శనివారం: అద్భుతమైన సాలీడు!


అద్భుతమైన స్పైడర్ మాన్! ఇప్పటి దాకా చూసిన స్పైడర్ మాన్ చిత్రాలకు భిన్నంగా వున్న ఈ చిత్రం ఇందులోని కథా నాయకుడిని ఒక కొత్త కోణం లో ఆవిష్కరించింది! వెండి తెర పైన అంత గొప్పగా, అబ్బురపరిచే రీతిలో చూపించినందుకు దర్శకుడు మార్క్ వెబ్బ్
 ని అభినందించాల్సిందే. నాతో పాటు చూస్తున్న వాళ్ళందరూ వీలలు వేసారు, చప్పట్లు కొట్టారు! చిత్రం మొదలైన మొదట్లో పెటర్ పార్కర్ కొన్ని సన్నివేశాలలో చేసిన వేషాలు చూసి వచ్చిన వినోదం అంతా ఇంతా కాదు! ఇర్ఫాన్ ఖాన్ ని ఇలాంటి ఒక పెద్ద చిత్రం లో
తెర పై చుసినప్పుడు వినిపించిన వీలలు అంతా ఇంతా కాదు! అవును మరి ఎంతైనా మనవాడు, మన దేశస్తుడు అంటే ఎవరికైనా గర్వంగా వుంటుందిగా! అదే మహేష్ బాబో, హ్రితిక్ రోషనో అయితే వీలలతో చిత్రమందిరం ఇంకా అదిరిపోతుంది! ఆ రోజు ఇంకేన్నాల్లో
లేదనిపిస్తుంది! ప్రపంచ స్థాయి లో మన చిత్రాలు మరింత పేరు సంపాదించటానికి ఇంకా చాలా చేయాల్సివుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు ప్రజల విసుగును గమనించి, వాళ్ళ రుచిని అర్థం చేసుకుని మనందరం గర్వించే చిత్రం వస్తుందని ఆశిస్తున్నాను.
మన దేశంలో మహానాయకుడు(సూపర్ హీరో) చిత్రాలకు వుండాల్సినంత ప్రాముఖ్యత లేదు. ఎక్కువ మంది ఇలాంటి చిత్రాలని చిన్న పిల్లల చిత్రాలుగా భావిస్తారు! దానికి కారణం వాటిని అందరికీ నచ్చేలా, పరిపక్వత తో నిండిన కథనంతో తెర మీద
చూపించలేకపొవటమే! యంత్రం(రోబో) కూడా అంతంత మాత్రమే అనిపించింది.
ఇక ఈ స్పైడర్ మాన్ చిత్రానికి వస్తే ఇందులో పాత స్పైడర్ మాన్ చిత్రాలతో పోల్చటం తప్పు. ఇది ఒక కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం కావటం వలన కొత్త నటులకి, వారి కథకి, కథనానికి అలవాటు పడటం కొంచెం కష్టం కావచ్చు.
అయితే ఇందులో టోబి మగ్వైర్ కి వున్న అమాయకత్వం లేనందున అందరి మనసులకు హత్తుకోకపోవచ్చు. అలాగే ఇందులో బుగల్ లేనందువలన ఆ కార్యాలయంలో పండించిన నవ్వులు లేవు. వచ్చే చిత్రంలో కొత్త పాత్రలతో మంచి హాస్యం పండుతుందని
అనుకుంటున్నాను. రెండవ భాగం ౨౦౧౪ మే లొ వస్తుందని సోనీ వాళ్ళు చెప్పినట్టు సమాచారం. ఇక పీటర్ పార్కర్ తల్లిదండ్రుల గురించి రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే అప్పటిదాకా వేచి వుండాలి!


..మీ అనిల్