1, నవంబర్ 2012, గురువారం
29, అక్టోబర్ 2012, సోమవారం
౨౯అక్టోబర్౨౦౧౨, సోమవారం
ఈ రోజే కొన్ని కొత్త పదాలు అంతర్జాలంలో(ఇంటర్నెట్లో) చూసాను. ఈ క్రింది పదాలను తమ పత్రికలో పొందుపర్చిన http://www.telugusahityam.com/ కి కృతజ్ఞతలు!
internet -- అంతర్జాలం
air hostess -- గగనసఖి
browser -- విహారిణి
gel -- జిగురు ద్రవం
wrong direction -- అపసవ్య దిశ
refund -- వాపసు చేయటం
contract workers -- ఒప్పంద కార్మికులు/ఉద్యోగులు
No frills -- శూన్య మొత్తం
Information Technology -- సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం
outsource -- పొరుగు సేవ
lubricant -- కందెన
(Dinner) Menu -- విందు జాబితా
Mass copying -- మూక చూచిరాత
value added services -- విలువ జత చేరిన సేవలు
Non-convertible debentures -- మార్పిడికి వీలు లేని రుణ పత్రాలు
BPO (Business process outsourcing) -- వ్యాపార పొరుగు సేవలు
..మీ అనిల్

23, అక్టోబర్ 2012, మంగళవారం
౨౩అక్టోబర్౨౦౧౨, మంగళవారం
కొన్ని పనులు జీవితకాలం సంతోషాన్ని, సంతృప్తిని మిగులుస్తాయి అంటారు. అలాంటి వాటిని చనిపోయే ముందు తప్పకుండా పూర్తి చేయాలనిపిస్తుంది. అలాంటి ఒక మనిషే యశ్ చోప్రా, అలాంటి ఒక చిత్రమే "జబ్ తక్ హై జాన్" అనుకుంటా. ఆయన చనిపోతూ ఈ ప్రపంచానికి ప్రేమ చిత్రాల మీద తనకున్న పట్టుని, రుచిని, ప్రతిభని చూపించటానికి చివరిగా మరో సారి తీసి వుంటారు. యశ్ చోప్రా మరణం హిందీ చలన చిత్ర సీమకి ఒక తీరని లోటు. వ్యక్తిగతంగా జీవితంలో మరచిపోలేని ఒక చిత్రం "వీర్ జార". యుగాలు మారినా, చెక్కు చెరగని ప్రేమకి ప్రతిరూపమే ఆ చిత్రం. రాబోతున్న "జబ్ తక్ హై జాన్" కూడా అలాంటి ఒక గొప్ప చిత్రం అవుతుందని అనుకుంటున్నాను.
ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నాను.
..మీ అనిల్
ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నాను.
..మీ అనిల్
29, ఆగస్టు 2012, బుధవారం
౨౮ఆగస్టు౨౦౧౨, బుధవారం: తెలుగు భాషా దినోత్సవం!
నేడే ఎంతగానో ఎదురు చూసిన తెలుగు భాషా దినోత్సవం! ఈ రోజు ప్రత్యేకంగా నాకు ఇష్టమైన సంభాషణలను, పాటల లోని కొన్ని చరణాలను ఇక్కడ వ్రాస్తున్నాను. వీటిలో ఎక్కువ చలన చిత్రాల పైనే వున్నాయి, ఎందుకంటే నాకు కుడా ఎక్కువ మంది లాగే చలన చిత్రాలంటే ఇష్టం!
"నిజాన్ని చెప్పకపోవటం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం"(అతడు - త్రివిక్రమ శ్రీనివాసు)
"అమ్మ.. నువ్వు కావాలే అమ్మ, నను వీడోద్దే అమ్మ బంగారం నువ్వమ్మ"(శేఖరు కమ్ముల తీసిన "ఎల్ ఐ బి" చిత్రం లోని ఒక పాట)

28, ఆగస్టు 2012, మంగళవారం
౨౭ఆగస్టు౨౦౧౨, మంగళవారం
మన తెలుగు భాషా దినోత్సవం రేపే!
ఇన్ని రోజులు పని అనే సంద్రంలో తేలుతూ వున్నాను! పోయిన ఆదివారం చూసిన "ఆవిడే శ్యామల" చలన చిత్రం నచ్చింది! అందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అలీ, సుత్తివేలు, తదితరులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు! సంభాషణలు కూడా సరిగ్గా వున్నాయి!

31, జులై 2012, మంగళవారం
౩౧జులై౨౦౧౨, మంగళవారం: శోభన్ బాబు- సోగ్గాడు!
ఆదివారం(౨౯జులై౨౦౧౨) జీ తెలుగులో వచ్చిన "శోభన్ బాబు వజ్రోత్సవం" చాలా బాగుంది. అంత అందం, విభిన్నత, అన్ని విజయాలు, ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్న ఒక గొప్ప నటుడి గురించి ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. పెద్ద నటీ-నటులు వాటిని గుర్తు తెచ్చుకుని చెప్తుంటే ఒక కొత్త అనుభూతి కలిగింది!
నేను ఒక చలన చిత్ర మందిరంలో చూసిన శోభన్ బాబు చిత్రం "ఏవండీ ఆవిడ వచ్చింది!"(ఆయన చివరి చిత్రం).
అందులో ఎంత బాగా చేసారో, అందం, ఇద్దరి భామల మధ్య చేసిన అల్లరి, పండించిన నవ్వులు, ఆయన్ని చూసి జనం కొట్టిన చప్పట్లు, ఈలలు అంత-ఇంతా కాదు! ఆ రోజులే వేరు!
తెలుగు చలన చిత్ర రంగానికి రామా రావు, అక్కినేని రెండు కళ్ళైతే, కృష్ణ, శోభన్ బాబు మరో రెండు కళ్ళు! నిజమే!
శోభన్ బాబు గారి అబ్బాయి కుడా ఆయనలాగే వుండటం, మాట్లాడటం మొదటి సారి చూసాను!
ఆ పూర్తి సన్మాన కార్యక్రమం ఒక మరువలేని అనుభవం! అంత పెద్ద వాళ్ళందరినీ ఒకే వేదిక మీద చూడగలగటం, శోభన్ బాబు గారితో వారి జ్ఞాపకాలు వింటుంటే మనసు పులకరించింది.

30, జులై 2012, సోమవారం
౩౦జులై౨౦౧౨, సోమవారం: "ఐ గాడిద"!
ఈ రోజుల్లో వస్తువులను ఎన్నో రకాలుగా, ఆకర్షనీయంగా అమ్ముతునారు! వీటిలో ఎమీ లేకపోయినా ఏదో గొప్ప విషయం వున్నట్టు చూపించి, ప్రజలను మాయచేసి ఎలాగైనా కొనేలా చేస్తారు! అలాగని అన్ని సంస్థలు ఇలాగే చేస్తాయని కాదు. కొన్ని సంస్థలు ఎలాంటి వస్తువుకైనా హంగులు వేసి అమ్మేలా చేస్తారు! అలాంటిదే ఈ కింది గాడిద!
..మీ అనిల్
..మీ అనిల్
౩౦జులై౨౦౧౨, సోమవారం: ఈగ ఈగ ఈగ!(కవిత)
రాజమౌళి "ఈగ" చిత్రం మీద ఒక చిన్న కవిత వ్రాయాలనిపించింది, వ్రాసాను!:
ఈగ ఈగ ఈగ!
రేణువంత వున్న ఒక గరుడలా
ఎర్రని కళ్ళలో కసి దాగివున్న
శత్రురాక్షసుని అంతిమ క్షణంలో
కనిపించే గోరంత యముడిలా
౬ కళ్ళ చిన్న గ్రహాంతర్వాసిలా
ఎగిరే ఒక మారణాయుధంలా
కండ బలాన్ని అంతంచేసే
గుండె బలంతో వచ్చిందిరా
మహా వేగాన్ని సొంతం చేసుకున్న
చిట్టి విమానంలా దూసుకువచ్చిందిరా
మన ఈగ ఈగ ఈగ!
మరువలేని అద్భుతాల మాయగాడిలా
ప్రేయసి రక్షణకై వచ్చిన మగాడిలా
సూదిని కుడా అస్త్రంలా వాడే వీరుడిలా
చావుని లెక్కచేయని మగదీరుడిలా
పగతో మండుతున్న అగ్నిగుండంలా
ప్రతీకారం తీసుకునే పిడుగులా
రెక్క విరిగినా పోటీ వీడని విక్రమార్కుడిలా
పొందలేని ప్రేమని కాపాడుకోవటానికి
కాలభైరవునిలా మళ్లి ఎగిరి వచ్చిందిరా
మన ఈగ ఈగ ఈగ!
తింటే పరమాన్నం తినాలిరా
వింటే భారతం వినాలిరా
తాగితే పానకం తాగాలిరా
పాడితే బాలు లా పాడాలిరా
కొడితే "పోకిరి" పండులా కొట్టాలిరా
నవ్వితే మహేష్ లా నవ్వాలిరా
గంతులేస్తే చిరు లా వేయాలిరా
కానీ చుస్తే ఈగనే చూడాలిరా
మన ఈగ ఈగ ఈగ!
..మీ అనిల్
13, జులై 2012, శుక్రవారం
౧౩జులై౨౦౧౨, శుక్రవారం
బాగా ప్రచారం జరిగిన ఒక మంచి చిత్రానికి ప్రజలు విజయ రథం పడటారంటానికి ఈగ ఘన విజయమే సాక్ష్యం!
రాజమౌళి చెప్పినట్టే అన్ని పనులూ సక్రమంగా చేయటం వలనే ఈ చిత్రం ఇంత గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటిది మంచి కథనం, అందులో కొత్తదనం, అనుకున్నది వచ్చేదాకా నిజాయితీగా పని చేయటం, పెద్ద కథానాయకుడు లేనందున అన్ని మాధ్యమాలలొనూ బాగా ప్రచారం చేయటం, అన్నీ కలిస్తేనే ఈగ లాంటి గొప్ప చిత్రం వచ్చింది. ఈ చిత్రంతో దర్శకుడి ప్రతిభతో, కష్టంతో ఎంతటి విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చని రుజువు చేసాడు మన "చలన చిత్ర శిల్పి" జక్కన్న!

ఒక నటుడికి దర్శకుడు గురువు లాంటి వాడు. నటులు దర్శకుని శిష్యులు. అలాగే నటులందరికీ ప్రజలు తల్లి-తండ్రుల్లాంటి వాళ్ళు! ఎందుకంటే మన కథా నాయకుడు ఎలా కనిపించాలో అలా కనిపించకపోతే ప్రజలు నిరాశ చెందుతారు! కాబట్టి తల్లి-తండ్రులకు నచ్చినట్టు పిల్లలు వుండకపోతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తారు!
అలాగని కథానాయకులు కొత్తగా కనిపించకూడదు అని కాదు. ప్రజల్ని మెప్పించి తమని తాము నిరూపించుకుంటే తప్పకుండా ప్రజలు బ్రహ్మరథం పడతారు!
ఈగ గుయ్యిమంటూ అందనంత ఎత్తుకు ఎగురుతున్న ఈ సమయంలో నాకొక భావం వచ్చింది! ఆలోచిస్తే నిజమే అనిపించింది. అదే:
ఒక నటుడికి దర్శకుడు గురువు లాంటి వాడు. నటులు దర్శకుని శిష్యులు. అలాగే నటులందరికీ ప్రజలు తల్లి-తండ్రుల్లాంటి వాళ్ళు! ఎందుకంటే మన కథా నాయకుడు ఎలా కనిపించాలో అలా కనిపించకపోతే ప్రజలు నిరాశ చెందుతారు! కాబట్టి తల్లి-తండ్రులకు నచ్చినట్టు పిల్లలు వుండకపోతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తారు!
అలాగని కథానాయకులు కొత్తగా కనిపించకూడదు అని కాదు. ప్రజల్ని మెప్పించి తమని తాము నిరూపించుకుంటే తప్పకుండా ప్రజలు బ్రహ్మరథం పడతారు!
..మీ అనిల్
8, జులై 2012, ఆదివారం
౮ జులై ౨౦౧౨, ఆదివారం: ఈగ ఈగ ఈగ!
ఈగ ఈగ ఈగ! యముడి మెరుపు తీగ! ఈగ అనేది ఒక చలన చిత్రం మాత్రమే కాదు! ఒక జరగబోయే సంచలనం. తెలుగు చిత్ర పరిశ్రమలో మొలకెత్తిన ఒక అద్భుతం! ఈగ ని ఎంత బాగా తయారు చేసారనేది ఒక విషయం అయితే ఆ ఈగని అంత బాగా నటింపచేసిన దర్శకుడు రాజమౌళికి జోహార్లు!
నేను అనుకున్న దానికంటే ఇంకా గొప్పగా తీసారంటే ఆ ఘనత రాజమౌళి గారిదే! ఎంతో మంది మన తెలుగు చలన చిత్ర రంగానికి వచ్చి ఏవేవో చేయాలనుకుంటారు. ఎన్నో గొప్ప చిత్రాలను తీసి తమ కల నిజం చేసుకోవాలనుకుంటారు. అలాటి కళాకారులకు
ఈగ ఒక మంచి స్పూర్తి కావాలి. ఈగ ఒక్క సంభాషణ కుడా లేకుండా కేవలం తన కదలికలతో మన మనసులను తాకగాలిగిందంటే, మనసులోని భావాలను వ్యక్తపరచగలిగిందంటే దానికి కారణం రాజమౌళి, మకుట లో పని చేసిన వాళ్ల కష్ట ఫలితమే!!
కష్టం తో పని చేసిన వాళ్లకి ఫలితం అన్నిటికన్నా తీయగా వుంటుందంటారు! ఇప్పుడు వాళ్ళు కుడా మన ఈగకు వస్తున్న అభినందనలను చుసి సంతోషం తట్టుకోలేక ఆనంద భాష్పాలు చిందించినా ఆశ్చర్యపడనక్కర్లేదు! ఎక్కడ చూసినా ఈగను ఇంత బాగా
తీసినందుకు అభినందనల జల్లులే! అసలైన వర్షాలు పడకపోయినా ఈ ఈగ ఆనందపు జల్లులు ఇప్పట్లో ఆగవని నా అభిప్రాయం. ఈగ ఒక సారి చూస్తే సరిపోయే చిత్రం కాదు.
శనివారం పొద్దున్న ఊర్వశి చిత్ర మందిరంలో ఈగ ని చూడటానికి వచ్చిన జనం అంతా ఇంతా కాదు! కిక్కిరిసిపోయిన ఆ జనం మధ్య ఒక చిత్రం చూడటమే ఒక గొప్ప అనుభూతి! ఇక రాజమౌళి చిత్రం అంటే చెప్పనక్కర్లేదు! ఇక చిత్రం మొదలై శుభం వచ్చే దాకా
అందరూ చప్పట్లు కొడుతూ, నవ్వుతూ ఆస్వాదించారు!
..మీ అనిల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)