6, ఫిబ్రవరి 2013, బుధవారం

౬ఫిబ్రవరి౨౦౧౩, బుధవారం

నాకు ఇష్టమైన ముల్లపూడి వెంకటరమణ గారి "బుడుగు"లో కొంత భాగం!

ఇందిర అనే రెండు జడల సీత ఖధ
ఒక బాబాయీ, ఇంకో ఆరు బాబాయిలూ, నేనూ కలిసి ఆ ఆడబడికి వెళ్ళామా.
అప్పుడు ఇందిర వచ్చింది కదా. రెండుజడలు వేసుకుందా మరి. ఇందిర అంటే కాలేజీ అమ్మాయి అని అర్థం.
ఈ ఇందిరేమో వాళ్ళకి తెలీదు. మరి యెలా మాటాడ్డం ?
ఒక బాబాయేమో నన్ను పిలిచి వురేయ్ సత్తరకాయీ సత్తరకాయీ మరేమో నువ్వూ ఈల వేసి ఇందిరని పిలవరా అన్నాడు.
నన్ను కొట్టుతుంది బాబూ అని చెప్పాను.
అయినా ఫరవాలేదులే అన్నాడు వాడు.
ఫరవాలేదులే అంటే కొట్టితే కొట్టనీ అని అర్థం.  
నేను మెల్లిగా ఈల వేశాను.
అలా కాదు గాఠిగా వెయ్యాలి. వేసి రెండు జెడల పిల్లా అని పిలవాలీ అన్నాడు వాడు. సరేగదా పాపం అని నేనూ అలా పిలిచాను గదా.
అప్పుడేమో ఆ యిందిర ఘబుక్కుని ఇటువేపు తిరిగి ఫోకిరీవాడులారా అనేసింది.
కాని అప్పుడు చూస్తే ఒక బాబాయీ లేడు. ప్పది బాబాయిలు కూడా అక్కడ లేరు. వాళ్ళు అందరూ గట్టుమీద కూచున్నారు.
నేను ఒక్కడే అక్కడ ఉన్నాడు.
నేను హాచ్చర్యపడిపోయేశాను.
ఇందిర కూడా హాచ్చర్యపడేసింది.
హారి నువ్వా పిడుగూ అంది.
నా పేరు బుడుగు. నువ్వే హారి పిడుగు అని చెప్పాను.
ఫోకిరీ పిల్లాడా అంది.
నువ్వే ఫొకిరి పిల్లాడా అని చెప్పేశాను నేను.
మరీ నన్ను రెండు జెడలు అని ఎందుకు పిలిచావు అంది.
నీకు రెండు జెడలు ఉన్నాయిగా అందుకని అని చెప్పేశాను.
ఉంటే నీకేం అంది.
ఉంటే నీకేం అంటే నాకు తెలీదు అని చెప్పేను.
తెలీకపోతే, ఇదిగో ఇదీ అనేసి, ఆ ఇందిర నా గుండు మీద మొట్టికాయ కొఠేసింది.
అయినా కోపం పోలేదు. అందుకని యిలా కింద కూచుని ముద్దు పెఠేసుకుంది. అప్పుడు సీగానపెసూనాంబ చూడలేదనుకో.
చూత్తే వెక్కలిత్తుంది.
మా  బామ్మా, అమ్మా అంతే. ఒక్కోసారి సీగానపెసూనాంబ చూస్తున్నప్పుడే నను బంగారు  తండిరీ అంటారు. అంటే ఫరవాలేదనుకో కాని ముద్దు కూడా పెఠేసుకుంటారు.
అప్పుడు సీగానపెసూనాంబ డిల్లమ్మా డిల్ల అని వెక్కిరిస్తుంది. అప్పుడు అమ్మ ఘబుక్కున దాన్ని కూడా పట్టుకుని ముద్దు పెఠేసుకుంటుంది.
అయిందా పెళ్ళి అని ఏడిపిస్తాననుకో అప్పుడు నేను.

..మీ అనిల్

9, డిసెంబర్ 2012, ఆదివారం

౯డిసెంబర్౨౦౧౨, ఆదివారం

గురజాడ అప్పారావు గారి గురించి కొన్ని మాటలు:

ఇక్కడ


..మీ అనిల్

౮డిసెంబర్౨౦౧౨, శనివారం

తెలుగు భాషలో ఎన్నో పదాలను చాలామంది మర్చిపోతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నాం.
అంతర్జాలం (ఇంటర్నెట్), గగనసఖి(ఎయిర్ హోస్టేస్), లాంటి పదాలు వాడటానికి ఎంతో సులువుగా వున్నాయి. వీటి వాడకం అస్సలు కష్టం కాదు.
పైనున్న వాటన్నిటిలో నాకు నచ్చింది "గగనసఖి". ఈ మాటలోనే ఎంతో అందం, ఆనందం వుంది!

మిగతా విషయాలకి వస్తే తిరుపతి రక్షణ దళం(పోలీసు) వారు తీసుకున్న నిర్ణయం మిగతా వారందరికీ ఒక మంచి స్పూర్తి కావాలి!
ఆ వార్త ఇక్కడ, మరియు ఇక్కడ వుంది.

..మీ అనిల్

13, నవంబర్ 2012, మంగళవారం

౧౩నవంబర్౨౦౧౨, మంగళవారం


నేను వ్రాసిన కొత్త కవిత:

దీపావళి ముద్దులు

చెవులు పగిలే టపాకాయలు వద్దు,
మిరుమిట్లుగొలిపే బుజ్జి-బుల్లి నవ్వే ముద్దు.
దీపావళిలో చిందులు వేసే కాలం రావాలి,
ఈ మెరుపుల్లో చీకటి దూరం కావాలి.
చిచ్చుబుడ్డి నుంచి వెలుగుల జల్లు వచ్చే,
వాటన్నిటినీ నా బుజ్జి మున్నాయి తెచ్చే.
తారాజువ్వ లా గీతలు ఆకాశ హరివిల్లు కాగా,
బుల్లి బుజ్జి ఊగె ఉయ్యాలే ఇంటి హరివిల్లు అవ్వగా!.
విష్ణు చక్రాలే అందరి ఆశీస్సులు కాగా,
అవే బుల్లి బుజ్జికి శ్రీ రామరక్ష కదా!


..మీ అనిల్

1, నవంబర్ 2012, గురువారం

ఆంధ్రరాష్ట్రావతరణ దినోత్సవం శుభాకాంక్షలు!

ఆంధ్రరాష్ట్రావతరణ దినోత్సవం శుభాకాంక్షలు!

ప్రజల్ని విడదీసి పాలించటానికి రాజకీయ నేతలు చేస్తున్న కుట్రలు, పన్నాగాల మధ్య జరుగుతున్న ఈ అవతరణ దినోత్సవం అందరి మధ్య వున్న దూరాన్ని తగ్గించి "కలసివుంటే కలదు సుఖం" అన్న మాటని నిజం చేస్తుంది అని ఆశిస్తూ..

..మీ అనిల్

29, అక్టోబర్ 2012, సోమవారం

౨౯అక్టోబర్౨౦౧౨, సోమవారం

ఈ రోజే కొన్ని కొత్త పదాలు అంతర్జాలంలో(ఇంటర్నెట్లో) చూసాను. ఈ క్రింది పదాలను తమ పత్రికలో పొందుపర్చిన http://www.telugusahityam.com/ కి కృతజ్ఞతలు!

internet -- అంతర్జాలం
air hostess -- గగనసఖి
browser --  విహారిణి 
gel -- జిగురు ద్రవం
wrong direction -- అపసవ్య దిశ
refund -- వాపసు చేయటం
contract workers -- ఒప్పంద కార్మికులు/ఉద్యోగులు
No frills -- శూన్య మొత్తం
Information Technology -- సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం
outsource -- పొరుగు సేవ 
lubricant -- కందెన
(Dinner) Menu -- విందు జాబితా
Mass copying -- మూక చూచిరాత  
value added services -- విలువ జత చేరిన సేవలు
Non-convertible debentures -- మార్పిడికి వీలు లేని రుణ పత్రాలు 
BPO (Business process outsourcing) -- వ్యాపార పొరుగు సేవలు 

..మీ అనిల్

23, అక్టోబర్ 2012, మంగళవారం

౨౩అక్టోబర్౨౦౧౨, మంగళవారం

కొన్ని పనులు జీవితకాలం సంతోషాన్ని, సంతృప్తిని మిగులుస్తాయి అంటారు. అలాంటి వాటిని చనిపోయే ముందు తప్పకుండా పూర్తి చేయాలనిపిస్తుంది. అలాంటి ఒక మనిషే యశ్ చోప్రా, అలాంటి ఒక చిత్రమే "జబ్ తక్ హై జాన్" అనుకుంటా. ఆయన చనిపోతూ ఈ ప్రపంచానికి ప్రేమ చిత్రాల మీద తనకున్న పట్టుని, రుచిని, ప్రతిభని చూపించటానికి  చివరిగా మరో సారి తీసి వుంటారు. యశ్ చోప్రా మరణం హిందీ చలన చిత్ర సీమకి ఒక తీరని లోటు. వ్యక్తిగతంగా జీవితంలో మరచిపోలేని ఒక చిత్రం "వీర్ జార". యుగాలు మారినా, చెక్కు చెరగని ప్రేమకి ప్రతిరూపమే ఆ చిత్రం. రాబోతున్న "జబ్ తక్ హై జాన్" కూడా అలాంటి ఒక గొప్ప చిత్రం అవుతుందని అనుకుంటున్నాను.
ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నాను.


..మీ అనిల్

29, ఆగస్టు 2012, బుధవారం

౨౮ఆగస్టు౨౦౧౨, బుధవారం: తెలుగు భాషా దినోత్సవం!

నేడే ఎంతగానో ఎదురు చూసిన తెలుగు భాషా దినోత్సవం! ఈ రోజు ప్రత్యేకంగా నాకు ఇష్టమైన సంభాషణలను, పాటల లోని కొన్ని చరణాలను ఇక్కడ వ్రాస్తున్నాను. వీటిలో ఎక్కువ చలన చిత్రాల పైనే వున్నాయి, ఎందుకంటే నాకు కుడా ఎక్కువ మంది లాగే చలన చిత్రాలంటే ఇష్టం!
"నిజాన్ని చెప్పకపోవటం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం"(అతడు - త్రివిక్రమ శ్రీనివాసు)
"అమ్మ.. నువ్వు కావాలే అమ్మ, నను వీడోద్దే అమ్మ బంగారం నువ్వమ్మ"(శేఖరు కమ్ముల తీసిన "ఎల్ ఐ బి" చిత్రం లోని ఒక పాట)



..మీ అనిల్

28, ఆగస్టు 2012, మంగళవారం

౨౭ఆగస్టు౨౦౧౨, మంగళవారం

మన తెలుగు భాషా  దినోత్సవం రేపే!
ఇన్ని రోజులు పని అనే సంద్రంలో  తేలుతూ వున్నాను! పోయిన ఆదివారం చూసిన "ఆవిడే శ్యామల" చలన చిత్రం నచ్చింది! అందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అలీ, సుత్తివేలు, తదితరులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు! సంభాషణలు కూడా సరిగ్గా వున్నాయి!


..మీ అనిల్